Site icon HashtagU Telugu

Suicide : భ‌ర్త మృతితో మన‌స్తాపానికి గురైన భ‌ర్య‌.. పిల్ల‌ల‌తో క‌లిసి ఆత్మ‌హ‌త్య‌

Suicide Hanging 19

Suicide Hanging 19

భర్త చనిపోవడంతో మనస్తాపానికి గురైన 55 ఏళ్ల మహిళ త‌న ఇద్ద‌రి పిల్ల‌ల‌తో క‌లిసి ఆత్మహత్య చేసుకుంది.
బోవెన్‌పల్లి ప్రాంతంలోని ఆమె ఇంట్లోని వేర్వేరు గదుల్లో ముగ్గురి మృతదేహాలు వేలాడుతూ కనిపించాయని పోలీసులు తెలిపారు. మృతురాలి బంధువు ఆమె ఇంటికి వెళ్లి డోర్ కోట్ట‌గా స్పంద‌న రాక‌పోవ‌డంతో అనంతరం ఇంటి యజమానిని పిలిచి వంటగది తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. మినీ హాల్‌లోని ఫ్యాన్‌కు మ‌హిళ వేలాడుతుంద‌ని.. ఆమె కుమార్తెలు వెయిటింగ్ హాల్‌లో మరియు బెడ్‌రూమ్‌లో వేలాడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో పోలీసు బృందానికి సూసైడ్ నోట్ దొరికింది. తమ మృతికి ఎవరూ కారణం కాదంటూ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. ఆ మహిళ భర్త అనారోగ్య కారణాలతో ఏప్రిల్‌ 4న మృతి చెందగా, అప్పటి నుంచి ఆమెతో పాటు ఇద్దరు కుమార్తెలు డిప్రెషన్‌లో ఉన్నారు. ముగ్గురూ అంతకుముందు కూడా నిద్ర మాత్రలు మరియు ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు, అయితే తరువాత వారికి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Exit mobile version