Woman Raped In Delhi: ఢిల్లీ మహిళపై హైదరాబాద్ యువకుడు రేప్!

కోర్టులు కఠిన చట్టాలు అమలుచేస్తున్నా.. పోలీసులు తీవ్రంగా వ్యవహరిస్తున్నా అత్యాచార ఘటనలు మాత్రం ఆగడం లేదు.

Published By: HashtagU Telugu Desk
Raped

Raped

కోర్టులు కఠిన చట్టాలు అమలుచేస్తున్నా.. పోలీసులు తీవ్రంగా వ్యవహరిస్తున్నా అత్యాచార ఘటనలు మాత్రం ఆగడం లేదు. గల్లీ నుంచి ఢిల్లీదాకా ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ మైనర్ రేప్ ఘటన మరువముందే.. తాజాగా ఢిల్లీలో మరో రేప్ కేసు వెలుగులోకి వచ్చింది. విచిత్రం ఏమిటంటే ఢిల్లీ యువతిపై అత్యాచారం జరిపిన వ్యక్తి హైదరాబాదే కావడం గమనార్హం. డేటింగ్ యాప్‌లో పరిచయమైన 28 ఏళ్ల (ఢిల్లీ) యువతి శుక్రవారం దేశ రాజధానిలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో అత్యాచారానికి గురైందని పోలీసులు తెలిపారు.

మే 30న ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలోని ఓ హోటల్‌లో తనపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపించించిది. మహిళ ఫిర్యాదు మేరకు జూన్ 3న కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు. ఒక దుకాణంలో పనిచేసే బాధిత మహిళ డేటింగ్ యాప్ లో యాక్టివ్ గా ఉండేది. టిండర్ (డేటింగ్ యాప్) ద్వారా హైదరాబాద్ యువకుడ్ని కలుసుకుంది అని డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (DCP) (ద్వారక) M. హర్ష వర్ధన్ తెలిపారు. అయితే నేరం జరిగిన తర్వాత నిందితుడు మహిళా ఫోన్స్ కాల్స్ ను లిఫ్ట్ చేయడం లేదు. బాధిత యువతి ఫిర్యాదు ఆధారంగా కేసు ఫైల్ అయ్యింది. కాగా నిందితుడిని పట్టుకునేందుకునేందుకు పోలీసులు రంగంలో దిగారని ఢిల్లీ సీనియర్ పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు.

  Last Updated: 10 Jun 2022, 01:45 PM IST