Wife Murders Husband : ఆమె తన భర్తతో అత్యంత కిరాతకంగా ప్రవర్తించింది. ఆస్తి కోసం భర్తను దారుణంగా కడతేర్చింది. తెలంగాణలో మర్డర్ చేసి.. డెడ్‌బాడీని కర్ణాటకలో పారవేయించింది. ఎవరూ గుర్తుపట్టకుండా డెడ్‌బాడీకి నిప్పు పెట్టించింది. వివరాలివీ..
Also Read :Palm Payment : అరచేతిని చూపిస్తే చాలు.. పేమెంట్ పూర్తవుతుంది.. చైనా తడాఖా
రమేష్.. వయసు 54 ఏళ్లు. హైదరాబాద్‌లోని ఉప్పల్ ఏరియాలో నివసించేవాడు. అతడు వ్యాపారాలు చేస్తుండేవాడు. అయితే అకస్మాత్తుగా అక్టోబరు 8 నుంచి రమేష్ కనిపించకుండా పోయాడు. దీనిపై అతడి భార్య నిహారిక స్థానిక పోలీసులకు కంప్లయింట్ ఇచ్చింది. తనకు ఏమీ తెలియనట్టు నటించింది. దీనిపై ఉప్పల్ పోలీసులు దర్యాప్తు చేస్తుండగా.. కర్ణాటకలోని కొడగు జిల్లా నుంచి కీలక సమాచారం అందింది. తెలంగాణ రిజిస్ట్రేషన్ కలిగిన కారులో కొడగుకు వచ్చిన ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు అని అక్కడి పోలీసులు తెలియజేశారు. దీంతో తెలంగాణ పోలీసులు ప్రత్యేక టీమ్‌ను ఇక్కడి నుంచి పంపారు. కొడగు జిల్లాలో ఉన్న కాఫీ తోటల్లో పూర్తిగా కాలిపోయిన స్థితిలో రమేష్ డెడ్‌బాడీ ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఎవరో గుర్తుతెలియని దుండగులు ఈ మర్డర్ చేసి ఉండొచ్చని తొలుత భావించారు.
Also Read :Nayanthara : ‘‘ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నారా ?’’.. నయనతార సుదీర్ఘ జవాబు
అనంతరం పోలీసులు.. రమేష్ కుటుంబంలోని వారందరి వివరాలను సేకరించారు. పెళ్లికి ముందు నిహారిక జైలుకు వెళ్లి వచ్చిందని గుర్తించారు. నేర చరిత్ర ఉండటంతో ఆమెపై పోలీసులకు డౌట్ వచ్చింది. నిహారికను(Wife Murders Husband) రమేష్ రెండో పెళ్లి చేసుకున్నాడనే మరో విషయం కూడా పోలీసులకు తెలిసింది. ఇటీవలే రమేష్‌ను భార్య నిహారిక ఒక పెద్ద కోరిక కోరింది. రూ.8 కోట్లు కావాలని అడిగింది. అయితే ఆ డబ్బును ఇవ్వలేనని అతడు చెప్పాడు. దీంతో తన ప్రేమికుడు నిఖిల్, అంకుర్ అనే మరో యువకుడితో కలిసి రమేష్ హత్యకు కుట్రను రెడీ చేసింది. ఈ ముగ్గురు కలిసి రమేష్‌ను గొంతుకోసి మర్డర్ చేసి.. మృతదేహాన్ని కర్ణాటకలోని కొడగు జిల్లాకు తీసుకెళ్లారు. అక్కడి కాఫీ తోటల్లో రమేష్ మృతదేహానికి దుప్పటికప్పి నిప్పంటించారు. అనంతరం హైదరాబాద్‌కు తిరిగొచ్చి ఏమీ తెలియనట్టుగా పోలీసులకు నిహారిక కంప్లయింట్ ఇచ్చింది.దీంతో నిహారిక, నిఖిల్, అంకుర్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.