Site icon HashtagU Telugu

Hyderabad: లైంగిక వేధింపులకు అడ్డాగా మారిన కేబీఆర్‌ పార్క్‌

Hyderabad

New Web Story Copy 2023 07 13t150852.154

Hyderabad: హైదరాబాద్ లో కేబీఆర్‌ పార్క్‌ అంటే తెలియని వారంటూ ఉండరు. జూబ్లీహిల్స్ ప్రధాన రహదారిపై ఉన్న కేబీఆర్‌ పార్క్‌ లో వాకింగ్ చేసేందుకు పొలిటీషియన్స్, సినిమా తారలు వస్తూ ఉంటారు. ప్రశాంతమైన వాతావరణం కావడంతో యువత క్యూ కడుతుంది. అయితే ఇదే అదునుగా కొందరు జులాయిలు కేబీఆర్‌ పార్క్‌ వద్ద తిష్ట వేసుకుని వచ్చే పొయ్యే వాళ్ళని లైంగికంగా వేధిస్తున్నారు. ఇదివరకు అక్కడ లైంగిక వేధింపులు ఘటనలు చాలానే జరిగాయి. తాజాగా ఓ మహిళ సినీ నిర్మాతకు చేదు అనుభవం ఎదురైంది.

కేబీఆర్‌ పార్క్‌ వద్ద జాగింగ్ చేస్తున్న మహిళా సినీ నిర్మాతను ఓ వ్యక్తి కారు నడుపుతూ వేధించాడు. వ్యక్తి అశ్లీల హావభావాలతో ప్రవర్తించాడు. తన ఫోన్ తో వీడియోలు తీస్తూ ఆమె ఎదురుగా వచ్చి ఇబ్బందికరంగా ప్రవర్తించాడు. 32 ఏళ్ళ సదరు సినీ నిర్మాత వేధింపులు తట్టుకోలేక బంజారాహీల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మహిళ చిత్రనిర్మాత ఫిర్యాదుపై పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్లు 354 A (లైంగిక వేధింపులు), 354 D (వెంబడించడం) మరియు 509 కింద కేసు నమోదు చేశారు. నిందితుడు నల్లటి వెర్నా కారులో వచ్చినట్టు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నది. నిందితుడిని గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. వీఐపీలతోపాటు మార్నింగ్ వాకర్లకు ప్రసిద్ధి చెందిన కేబీఆర్ పార్క్‌లో గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. గత ఏడాది ఏప్రిల్‌లో మార్నింగ్ వాక్ చేస్తున్న 45 ఏళ్ల మహిళపై ఇద్దరు వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. నవంబర్ 2021లో టాలీవుడ్ నటి షాలు చౌరసియా ఈవినింగ్ వాక్ చేస్తున్నప్పుడు దాడి చేసి దోచుకున్నారు. దాడిని ప్రతిఘటించే క్రమంలో ఆమెకు గాయాలయ్యాయి. అదే నెలలో గుర్తు తెలియని వ్యక్తి తనను వేధించి రూ.2,500 లాక్కెళ్లాడని మరో మహిళ ఫిర్యాదు చేసింది.

Read More: AP Politics: వైసీపీలో వర్గపోరు.. జగన్ కు షాక్ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే

Exit mobile version