Woman Dies : వివాహిత ప్రాణం తీసిన చున్నీ..

మృతువు ఏ రూపంలో వస్తుందో ఎవ్వరికి తెలియదు..అప్పటివరకు మనతో..మన మధ్య సంతోషంగా ఉన్నవారు సడెన్ గా చనిపోతున్నారు. ముఖ్యంగా ఇటీవల హార్ట్ ఎటాక్ తో ఎక్కువగా మరణిస్తున్నారు. గతంలో 60 , 70 ఏళ్ల పైబడిన వారు ఎక్కువగా గుండెపోటు తో మరణించే వారు కానీ కరోనా తర్వాత వయసు తో సంబంధం లేకుండా గుండెపోటు లు వచ్చేస్తున్నాయి. రెండేళ్ల పిల్లల దగ్గరి నుండి 40 ఏళ్ల లోపు వారు ఎక్కువగా గుండెపోటు తో ప్రాణాలు విడుస్తున్నారు. […]

Published By: HashtagU Telugu Desk
Women Dies

Women Dies

మృతువు ఏ రూపంలో వస్తుందో ఎవ్వరికి తెలియదు..అప్పటివరకు మనతో..మన మధ్య సంతోషంగా ఉన్నవారు సడెన్ గా చనిపోతున్నారు. ముఖ్యంగా ఇటీవల హార్ట్ ఎటాక్ తో ఎక్కువగా మరణిస్తున్నారు. గతంలో 60 , 70 ఏళ్ల పైబడిన వారు ఎక్కువగా గుండెపోటు తో మరణించే వారు కానీ కరోనా తర్వాత వయసు తో సంబంధం లేకుండా గుండెపోటు లు వచ్చేస్తున్నాయి. రెండేళ్ల పిల్లల దగ్గరి నుండి 40 ఏళ్ల లోపు వారు ఎక్కువగా గుండెపోటు తో ప్రాణాలు విడుస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా ఓ వివాహితను మాత్రం చున్నీ ప్రాణం పోయేలా చేసింది. మాములుగా బైక్ ప్రయాణం చేసే సమయంలో చాలామంది చున్నీ ని గాలికి వదిలేస్తారు..దీంతో అది చక్రాల్లో చిక్కుకొని కిందపడేలా చేయడం..లేదా ఏదొక ప్రమాదానికి గురయ్యేలా చేయడం చేస్తుంది. తాజాగా మహబూబ్‌నగర్‌ జిల్లాలో అదే జరిగింది. కొత్తకోట వీవర్స్‌ కాలనీకి చెందిన యాదగిరికి పోతు గౌతమి(19)తో ఏడాది కిందట వివాహమైంది. గౌతమి తల్లిగారి ఊరైన మహబూబ్‌నగర్‌ జిల్లాలోని చిన్నచింతకుంటతో పాటు కురుమూర్తి గ్రామానికి ఆదివారం వెళ్లింది. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో వీవర్స్ కాలనీకి దంపతులు బైక్‌పై తిరుగు ప్రయాణం అయ్యారు. మదనాపురం మండలంలోని దంతనూర్‌ సమీపంలోకి రాగానే.. గాలికి గౌతమి చున్నీ బైక్ వెనుక చక్రాల్లో చిక్కుకుంది. దాంతో ఆమె అకస్మాత్తుగా రోడ్డుపై పడిపోవడం తో తలకు తీవ్ర గాయమైంది.
వెంటనే ఆమెను కొత్తకోట ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించగా అక్కడి ప్రథమ చికిత్స చేశారు. అనంతరం హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. గౌతమీ మృతి తో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.వివాహమైన ఏడాదిలోపే మృత్యువాత పడటంతో కన్నీరుమున్నీరు అవుతున్నారు.

Read Also : Uniform Civil Code Bill : ఉత్తరాఖండ్‌ ఉమ్మడి పౌర‌స్మృతి బిల్లుకు ఆమోదం తెలిపిన రాష్ట్రపతి

  Last Updated: 13 Mar 2024, 04:03 PM IST