Site icon HashtagU Telugu

Woman Brutally Murdered : మహిళను హత్య చేసి కాల్చేసిన దుండగులు.. శంషాబాద్‌లో ఘోరం

Indian Student Dies In US

Crime Imresizer

Woman Brutally Murdered : దిశ ఉదంతం తరహా మరో ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో చోటుచేసుకుంది. ఓ మహిళ దారుణ హత్యకు గురైంది.. శంషాబాద్‌లోని సాయి ఎన్‌క్లేవ్‌లో ఇళ్ల స్థలాల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు మహిళను హత్య చేసి ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.ఆ మహిళ  మృతదేహం పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉండగా స్థానికులు గుర్తించి శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీసులకు సమాచారం అందించారు. ఆ మహిళ వయసు 36 ఏళ్లు ఉండొచ్చని భావిస్తున్నారు.  కాళ్లకు మెట్టెలు ఉండటంతో వివాహిత  అని గుర్తించారు.

Also read : Russia Moon Mission : చంద్రయాన్-3కి పోటీగా రష్యా “లునా – 25”.. చంద్రయాన్-3 కంటే ముందే చంద్రుడిపైకి చేరేలా ప్లాన్

కేసు నమోదు చేసుకున్న శంషాబాద్ ఎయిర్‌పోర్టు  పోలీసులు.. విచారణ కోసం నాలుగు ప్రత్యేక టీమ్స్ ను రంగంలోకి దింపారు. ఆ మహిళను  ముందుగానే చంపేసి అక్కడకు తీసుకొచ్చి తగులబెట్టారా ? అత్యాచారం జరిగిందా? అనే అంశాలపై ఫోకస్ తో  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.