Site icon HashtagU Telugu

Stray Dogs : చిత్రపురి కాలనీలో మహిళపై 15 కుక్కల దాడి

Woman Attacked By Stray Dog

Woman Attacked By Stray Dog

హైదరాబాద్ (Hyderabad) లో వీధికుక్కలు (Stray Dogs) బెడద రోజు రోజుకు ఎక్కువైపోతోంది..ఒంటరిగా వెళ్లాలంటే భయం వేస్తుంది. ఎక్కడి నుండి ఎన్ని కుక్కలు దాడి చేస్తాయో అర్ధం కావడం లేదు. కుక్కలా దాడిలో పలువురి మరణాలు , గాయాలు జరిగిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ వీటిని అరికట్టడం లో మున్సిపాలిటీ నిర్లక్ష్యం వహిస్తుంది. తాజాగా చిత్రపురి కాలనీలో ఒంటరిగా వెళ్తున్న మహిళా ఫై ఏకంగా 15 కుక్కలు దాడి చేసాయి.

We’re now on WhatsApp. Click to Join.

చిత్రపూరి కాలనీలో ఈరోజు (జూన్ 22న) ఉదయం 6 గంటల సమయంలో.. వాకింగ్ కోసం తన ఇంటి దగ్గర్లోని గ్రౌండ్‌కి స్కూటీపై వెళ్లిన ఓ మహిళ తన వాహనాన్ని పార్క్ చేసి ఒంటరిగా వెళ్తుండగా.. ఒక్కసారిగా వీధి కుక్కలు దాడికి ఎగబడ్డాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 కుక్కలు దాడి చేశాయి. అన్ని కుక్కలు దాడికి ఎగబడటంతో.. ఆ మహిళ గుండెలు జారిపోయాయి. చుట్టుముట్టిన ఆ కుక్కలను చూసి వెన్నులో వణుకు పుట్టినా.. చుట్టుముట్టిన కుక్కలను వెళ్లగొట్టేందుకు సాయాశక్తులా ప్రయత్నించింది. రెండు చేతులా వాటిని తరిమికొడుతూ.. దాడి నుంచి తనను తాను కాపాడుకునేందుకు యత్నించింది. సాయం కోసం అరుస్తూనే.. ప్రాణాలు కాపాడుకునేందుకు ధైర్యంగా వాటితో సుమారు అరగంటసేపు పోరాటం చేసింది. మధ్యలో.. ఆ మహిళ్ల ఒక్కసారిగా కుప్పకూలిపోగా.. ఆమెపైకి కుక్కలు గుంపుగా ఎగబట్టాయి. అయినా సరే.. ఆమె క్షణాల్లోనే ధైర్యాన్ని కూడగట్టుకుని మళ్లీ వాటిపై యుద్ధం కొనసాగించింది. ఇంతలో అదే మార్గంలో ఓ ద్విచక్రవాహనదారుడు రావడంతో వీధికుక్కలు పరుగులు తీశాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలో ఏర్పాటు చేసిన సీసీకెమెరాలో రికార్డయ్యాయి.

Read Also :