Site icon HashtagU Telugu

Hyderabad : మ‌హిళ‌పై లైంగిక దాడి.. ఇద్ద‌రు అరెస్ట్‌

Raped

Raped

హైదరాబాద్‌లో మహిళపై లైంగిక దాడికి పాల్పడి, ఆమె బంగారు గొలుసును దొంగిలించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 18న తాను పనిమనిషిగా పనిచేస్తున్న ఇంట్లో పని ముగించుకుని పీరంచెరువు నుంచి తన నివాసానికి నడుచుకుంటూ వెళ్తున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌ని బాధితురాలు పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు ఆమెను పని కోసం తీసుకెళ్తానని సాకుతో త‌న వద్దకు వచ్చి త‌న‌ను కారులో ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక‌దాడికి పాల్ప‌డ్డార‌ని ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత వారిద్దరు తన 24 గ్రాముల బంగారు గొలుసును కూడా తీసుకెళ్లారని మహిళ ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీతో పాటు ఇతర ఆధారాలను నార్సింగి పోలీసులు సేకరించి ఇద్దరు నిందితుల‌ను అరెస్ట్ చేశారు. చోరీకి గురైన బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. నేరానికి వినియోగించిన వాహనాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.