Winter season Start : మంచు ముంచుతోంది… ఇక వణుకుడే వణుకుడు

తెలంగాణ లో నాలుగైదు రోజుల క్రితం వ‌ర‌కు ప‌గ‌లు, రాత్రి స‌మ‌యాల్లో ప్ర‌జ‌లు ఉక్క‌పోత‌తో అల్లాడిపోయారు. కానీ ఇప్పుడు నైరుతి రుతుప‌వ‌నాలు తిరుగుముఖం ప‌ట్ట‌డంతో శీత‌ల గాలులు వీస్తున్నాయి

Published By: HashtagU Telugu Desk
Winter Season Start In Tela

Winter Season Start In Tela

చలికాలం (Winter season) మొదలైందా..అంటే అవుననే చెప్పాలి..రెండు తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) ఉష్ణోగ్ర‌త‌లు తగ్గుముఖం పట్టాయి. ఉదయాన్నే మంచు ముంచుతూ..వణుకు పుట్టిస్తుంది. తెలంగాణ లో నాలుగైదు రోజుల క్రితం వ‌ర‌కు ప‌గ‌లు, రాత్రి స‌మ‌యాల్లో ప్ర‌జ‌లు ఉక్క‌పోత‌తో అల్లాడిపోయారు. కానీ ఇప్పుడు నైరుతి రుతుప‌వ‌నాలు తిరుగుముఖం ప‌ట్ట‌డంతో శీత‌ల గాలులు వీస్తున్నాయి. ఉదయాన్నే మంచు కురుస్తూ వణుకు పుట్టిస్తుంది.

రాష్ట్రంలో పలు జిల్లాలో ఉష్ణోగ్ర‌త‌లు చూస్తే.. ఆదిలాబాద్‌లో 1.8 డిగ్రీలు త‌గ్గి 17.2 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయ్యాయి. వరంగల్ లో సాధార‌ణం క‌న్నా 2.7 డిగ్రీలు త‌గ్గి, క‌నిష్ఠ ఉష్ణోగ్ర‌త 19.5 డిగ్రీలు న‌మోదైంది. రామ‌గుండం, మెద‌క్‌, హ‌నుమ‌కొండ‌లో ప‌గ‌టి ఉష్ణోగ్ర‌త‌లు త‌గ్గాయి. ఖ‌మ్మంలో మాత్రం సాధార‌ణం క‌న్నా 3.3 డిగ్రీలు అధికంగా, గ‌రిష్ఠ ఉష్ణోగ్ర‌త 35.2 డిగ్రీలు న‌మోదైంది. హైద‌రాబాద్, భ‌ద్రాచ‌లం, ఆదిలాబాద్‌లోనూ సాధార‌ణం క‌న్నా కొంచెం ఎక్కువ‌గా ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయ్యాయి.

We’re now on WhatsApp. Click to Join.

మెున్నటి వరకు తెలంగాణ (Telangana)లో విపరీతమైన ఎండలు ప్రజలను ఇబ్బంది పెట్టగా.. తాజాగా చలికాలం (Winter season) ప్రారంభమైంది. రుతు పవనాలు తిరుగుముఖం పట్టడంతో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో ఈసారి విభిన్న వాతావరణపరిస్థితులు నెలకొన్నాయి. ఎండకాలం ప్రారంభం మాదిరిగా భానుడు ప్రతాపం చూపుతున్నాడు. గత కొద్ది రోజులుగా పగటిపూట ఉష్టోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇది ఎండాకాలమా? శీతాకాలమా ? అన్న అనుమానం వచ్చే విధంగా మధ్యాహ్నం సమయంలో 33-36 డిగ్రీ సెంటిగ్రేడ్ల మధ్య ఉష్టోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఇప్పుడు చలి మొదలు కావడం తో హమ్మయ్య అనుకుంటున్నారు.

Read Also : Boora Narsaiah Vs Rajagopal Reddy : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై పోటీకి బీజేపీ కీలక నేత రెడీ ?

  Last Updated: 24 Oct 2023, 09:55 AM IST