Wine Shops Close : తెలంగాణ లో 48 గంటలపాటు మద్యం దుకాణాలు బంద్

మే 11న శనివారం సాయంత్రం 6 గంటల నుంచి మే 13న సోమవారం సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాప్స్ మూసివేయాలని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది

  • Written By:
  • Publish Date - May 8, 2024 / 11:31 PM IST

అసలే ఎండలు..పైగా కావాల్సిన బీర్లు కూడా దొరకడం లేదు..ఏదోక బీరో ..మందో తాగుతూ ఎండవేడి నుండి ఉపశమనం పొందుతున్న మందుబాబులకు తెలంగాణ సర్కార్ షాక్ ఇచ్చింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో 48 గంటలపాటు మద్యం షాప్స్ బంద్ చేయాలనీ ఆదేశాలు జారీ చేసింది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడం కోసం ప్రతిసారి ఎన్నికల సమయంలో ఈ నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. తెలంగాణ లో మే 13 న లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే.

We’re now on WhatsApp. Click to Join.

ఇప్పటికే గత రెండు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ నడుస్తుంది. ఇక ఇప్పుడు ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో మే 11న శనివారం సాయంత్రం 6 గంటల నుంచి మే 13న సోమవారం సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాప్స్ మూసివేయాలని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వైన్ షాప్స్ తో పాటు , బార్లు, కల్లు కాంపౌండ్లు కూడా రెండు రోజులపాటు మూతపడనున్నాయి. అంతే కాదు మళ్లీ ఎన్నికల ఫలితాల రోజు కూడా మద్యం దుకాణాలు మూతపడతాయని పేర్కొంది. జూన్ 4వ తేదీన మందు బాబులకు లిక్కర్ దొరకదని ముందే వెల్లడించింది. ఫలితాల రోజు ఏమోలేకాని..ప్రస్తుతం ఈ రెండు రోజులకు సరిపడా సరకు ముందు తెచ్చుకోవాలని మందుబాబులు ప్లాన్ చేస్తున్నారు.

Read Also : IPL 2024 : లక్నో ఫై ఓపెనర్ల ఊచకోత..SRH ఘనవిజయం