Wine Shops Tenders : ఎలక్షన్స్ ముందు ప్రభుత్వానికి భారీ ఆదాయం.. మద్యం టెండర్లతో ఏకంగా 2500 కోట్ల పైనే..

తాజాగా తెలంగాణ ప్రభుత్వానికి ఏకంగా మద్యం టెండర్ల(Wine Shops Tenders)ద్వారా 2500 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది.

Published By: HashtagU Telugu Desk
Wine Shops Tenders Income for Telangana almost 2500 crores above

Wine Shops Tenders Income for Telangana almost 2500 crores above

తెలంగాణ(Telangana)లో త్వరలోనే ఎలక్షన్స్(Elections) రానున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు ఎలక్షన్స్ కి సిద్ధమవుతున్నాయి. ఇక ఎలక్షన్స్ కి కావాల్సిన డబ్బుని కూడా సమకూర్చుకుంటున్నాయి. ఎలక్షన్స్ వస్తున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం కొత్త కొత్త పథకాలు, హామీలు కూడా ఇస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వానికి భారీ ఆదాయం కావాలి. తాజాగా తెలంగాణ ప్రభుత్వానికి ఏకంగా మద్యం టెండర్ల(Wine Shops Tenders)ద్వారా 2500 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది.

తెలంగాణలో 2023-25 రెండు సంవత్సరాలకు గాను మద్యం షాపు టెండర్లకి దరఖాస్తు చేసుకోమని ఇటీవల ప్రకటించారు. నిన్నటితో ఆ దరఖాస్తు తేదీ ముగిసింది. తెలంగాణలో 2620 వైన్ షాపులకు గాను ఇప్పటి వరకు మొత్తం 1,07,016 టెండర్స్ దరఖాస్తులు వచ్చాయి. ఒక్కొక్క దరఖాస్తుకు నాన్ రీఫండబుల్ అమౌంట్ రెండు లక్షలుగా పెట్టారు. అంటే ఈ డబ్బంతా మళ్ళీ వెనక్కి ఇవ్వబడదు. ఇదంతా ప్రభుత్వ ఆదాయం కిందకి వస్తుంది.

ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులతో ప్రభుత్వానికి ఏకంగా 2 వేల 697 కోట్ల ఆదాయం చేకూరింది. గత సారితో పోలిస్తే ఈ సారి ఇంకా ముప్పై వేలకు పైగా దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి. అత్యధికంగా సరూర్ నగర్ ఎక్సయిజ్ యూనిట్ లో 8,883 ధరఖాస్తులు, రెండవ స్థానంలో శంషాబాద్ ఎక్సయిజ్ యూనిట్ లో 8749 ధరఖాస్తులు వచ్చాయి. త్వరలోనే లాటరీ పద్దతిలో రెండేళ్లకు గాను ఈ వైన్ షాపులను కేటాయించనున్నారు.

 

Also Read : Telangana: దళిత బంధుని పారదర్శకంగా అమలు చేయాలి

 

  Last Updated: 19 Aug 2023, 08:07 PM IST