Wine Shops Closed : మందుబాబులకు చేదు వార్త..ఎల్లుండి వైన్ షాప్స్ బంద్

ఎల్లుండి 23న ఉదయం 6 గంటల నుంచి 24న ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు మూతపడనున్నాయి

  • Written By:
  • Publish Date - April 21, 2024 / 07:56 PM IST

హైదరాబాద్ (Hyderabad) నగరవాసులకు వరుస చేదు వార్తలు బాధను కలిగిస్తున్నాయి. నేడు నాన్ వెజ్ (Non Veg) షాప్స్ క్లోజ్ అయ్యి..ముక్క తినకుండా చేయగా..ఎల్లుండి వైన్ షాప్స్ బంద్ కాబోతున్నాయి. దీంతో ఆ రోజు మందు చుక్క లేకుండా అవుతుంది. ఈరోజు (ఏప్రిల్ 21) మ‌హావీర్ జ‌యంతి (Mahavir Janma Kalyanak) సందర్బంగా నగరంలో నాన్ వెజ్ షాప్స్ క్లోజ్ అవ్వగా..ఎల్లుండి (ఏప్రిల్ 23) హనుమాన్ జయంతి (Hanuman Jayanti) సందర్బంగా నగరంలో అన్ని వైన్ షాపులను మూసివేయాలని హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. ఎల్లుండి 23న ఉదయం 6 గంటల నుంచి 24న ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు మూతపడనున్నాయి. ఎవరైనా నిబంధనలు ఉల్లఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ‘హనుమాన్‌ జయంతి’ విషయానికి వస్తే..హిందువులు ఎంతో భక్తిశ్రద్దలతో జరుపుకునే ఉత్సవాల్లో ‘హనుమాన్‌ జయంతి’ ఒకటి. ఏటా చైత్ర మాసం శుక్ల పక్ష పౌర్ణమి రోజున దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతిని ఘనంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఏప్రిల్‌ 23వ తేదీ మంగళవారం రోజున హనుమాన్ జయంతిని జరుపుకోనున్నారు. అయితే.. పురాణాల ప్రకారం ఆ పవన పుత్రుడు మంగళవారం జన్మించాడని పండితులు చెబుతారు. ఈ సారి మంగళవారం హనుమాన్ జయంతి రావడంతో ఈ పండుగ ఎంతో శుభప్రదమైనదిగా భావిస్తున్నారు.

Read Also : BRS MP: హత్యా రాజకీయాలకు కేసీఆర్ పూర్తి వ్యతిరేకం : ఎంపీ వద్దిరాజు