Wine Shops Close : మందు బాబులకు ముఖ్య గమనిక..

ఈ నెల 17 న శ్రీరామ నవమి సందర్బంగా హైదరాబాద్ తో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో 17వ తేదీ ఉదయం 6 గంటల నుండి 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు మూసివేయాలని ఆదేశాలు జరిపారు

  • Written By:
  • Publish Date - April 15, 2024 / 06:30 PM IST

హైదరాబాద్ (Hyderabad) మందు బాబులు తెలుసుకోవాల్సిన వార్త..మరికొద్ది గంటల్లో వైన్ షాప్స్ బంద్ (Wine Shops Close) కాబోతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ (Election Code) నడుస్తుండడంతో మందు బాబులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాప్స్ బంద్ కావడం..బహిరంగ ప్రదేశాల్లో మందు తాగితే పోలీసులు ఫైన్ వేయడం లేదా అదుపులోకి తీసుకోవడం చేస్తున్నారు. దీంతో ఉన్న వైన్ షాప్స్ లలో రెండు పెగ్ లు వేసి వేసవి తాపాన్ని తీర్చుకుంటున్నారు. ఈ తరుణంలో పోలీసులు ఓ షాకింగ్ వార్త తెలియజేసారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ నెల 17 న శ్రీరామ నవమి (Srirama Navami) సందర్బంగా హైదరాబాద్ తో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో 17వ తేదీ ఉదయం 6 గంటల నుండి 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు మూసివేయాలని ఆదేశాలు జరిపారు సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. శ్రీరామనవమి పండుగ సందర్భంగా నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా శాంతి భద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా మద్యం దుకాణాలు తెరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దీంతో వైన్ షాప్స్ అన్ని కూడా షాపుల ముందు ఎల్లుండి వైన్ షాప్స్ బంద్ అని బోర్డు పెట్టాయి. ఈ బోర్డు చూసి మందు బాబులు షాక్ అవుతూ..ముందుగానే తమకు కావాల్సిన మందును కొనుగోలు చేస్తున్నారు. వైన్ షాపులతో పాటు బార్లు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లు సైతం మూతపడనున్నాయి.

Read Also : Viveka Murder Case : అవినాష్ బెయిల్ రద్దు ఫై ముగిసిన వాదనలు..తీర్పు రిజర్వ్ చేసిన కోర్ట్