Site icon HashtagU Telugu

Wine Shops : మందుబాబులు జాగ్రత్తపడండి..మూడు రోజులు వైన్ షాప్స్ బంద్

Wine Shops Closed

Wine Shops Closed

తిండిలేకపోయిన పర్వాలేదు కానీ మందు లేకపోతే బ్రతకలేం అని చాలామంది మందు (Wine) బాబులు అనేమాట. అలాంటి మందుబాబులు అలర్ట్ కావాల్సిన సమయం వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల (Telangana Elections) హడావిడి మొదలైంది. నవంబర్ 30 న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజులపాటు వైన్ షాప్స్ బంద్‌ (Wine shops) కానున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఈ నెలాఖరులో వరుసగా మూడు రోజులు పాటు ‘డ్రై డే’గా పాటించనున్నారు. ఈ నెల 30 పోలింగ్‌ సందర్బంగా ఆరోజుతో పాటు నవంబర్‌ 28, 29 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని వైన్ షాప్స్, బార్లు (Three Days Wines Close) మూతపడనున్నాయి. మళ్లీ డిసెంబర్‌ 1న వైన్‌ షాపులు తెరచుకోనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం(CEC) ఆదేశాల మేరకు రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది.

ఇప్పటికే ఎన్నికల కోడ్ (Election Code) నేపథ్యంలో బెల్ట్ షాప్స్ మూతపడ్డాయి. వైన్ షాప్స్ , బార్ లలో తప్ప బయట ఎక్కడ కూడా మద్యం దొరకడం లేదు. దీంతో మందుబాబులు మద్యం కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు. ఈ క్రమంలో మూడు రోజుల పాటు వైన్ షాప్స్ బంద్ అయితే వారు తట్టుకోవడం కష్టమే. అందుకే ఇప్పటి నుండే ఆ మూడు రోజులకు సరిపడా మద్యాన్ని దాచుకోవాలని చూస్తున్నారు. మరికొంతమంది మాత్రం అవసరం లేదు. ఎన్నికల ప్రచారం లో నేతలు మద్యం పంచుతారు కదా..ఇంకెందుకు మన డబ్బులు పెట్టుకొని కొనడం అంటున్నారు. ఏది ఏమైనప్పటికి మూడు రోజులు మాత్రం మందుబాబులకు కష్టాలే.

Read Also : KCR Sentiment Temple : కోనాయిపల్లి ఆలయానికి కేసీఆర్ ఉన్న అనుబంధం ఈనాటిది కాదు ..