పవిత్రమైన శ్రీరామనవమి (Sriramanavami ) పర్వదినాన్ని పురస్కరించుకుని, హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో మద్యం విక్రయాలను (Wine Shops) నియంత్రించేందుకు పోలీసు విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వైన్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు పూర్తిగా మూసివేయాలని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు ఆదేశాలు జారీ చేశారు. పబ్లిక్ ప్లేసుల్లో శాంతి భద్రతలు కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
IPL 2025 : SRH మళ్లీ ఫామ్లోకి వస్తుందా?
ఇక ఈ ఆదేశాల మేరకు బార్లు, రెస్టారెంట్లు కూడా తమ మద్యం అమ్మకాలను ఆపాల్సి ఉంటుంది. అయితే స్టార్ హోటళ్లలోని బార్లు, రిజిస్టర్డ్ క్లబ్స్కు మాత్రం మినహాయింపు కల్పించారు. అది కూడా కేవలం వారి సభ్యులకు మాత్రమే పరిమితం చేస్తూ ఆంక్షలు విధించారు. శ్రీరామనవమి వేళ ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా పోలీసులు ముందస్తు ఏర్పాట్లు చేశారు.
అటు జిల్లా ప్రాంతాల్లో మాత్రం వైన్ షాపులు తెరిచే ఉంటాయి. కానీ నగరంలోని ముఖ్య ప్రాంతాల్లో భద్రతా దృష్ట్యా షాపుల మూసివేతకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ప్రజలు పండుగ సందర్భంగా శాంతియుతంగా వ్యవహరించాలని, ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.