Site icon HashtagU Telugu

Hyderabad: రేపు, ఎల్లుండి హైదరాబాద్‌లో వైన్స్ బంద్.. సీపీ ఆనంద్ ఉత్తర్వులు

Wine shops will be closed in Hyderabad tomorrow... Implementation of section 144

Wine shops bandh for two days in Hyderabad

Wine shops bandh for two days in Hyderabad : హైదరాబాద్‌లో రెండు రోజులు వైన్స్‌ షాపులు మూతపడనున్నాయి. వినాయక నిమజ్జనం నేపథ్యంలో ఈ నెల 17, 18 తేదీల్లో మద్యం దుకాణాలు మూసివేయాలని పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఆదేశాలు జారీచేశారు. అయితే గణేష్ నిమజ్జనం సందర్భంగా శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలుపుతున్నారు. ఇందులో భాగంగానే నగరంలోని మద్యం, కల్లు దుకాణాలు మూసేయనున్నారు. తెలంగాణ ఎక్సైజ్‌ చట్టం 1968లోని సెక్షన్‌ 20 కింద ఉత్తర్వులు జారీచేసినట్లు తెలిపారు. ఎవరైనా ఉత్తర్వులను అతిక్రమించి షాపులు తెరిచినట్లయితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Read Also: Jammu and Kashmir : జమ్మూకశ్మీర్ లో ఎల్లుండే తొలి దశ ఎన్నికలు..భారీగా భద్రత ఏర్పాటు..!

ఈ క్రమంలోనే రేపు ఉదయం 6 గంటల నుండి ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో వైన్స్, బార్, కల్లు కాంపౌడ్లు బంద్ చేయాలని పేర్కొన్నారు. ఒకవేళ ఆదేశాలను ఎవరైనా ఉలంగిస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవు అని హెచ్చరించారు, అదే విధంగా చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు జంట నగరాల పరిధిలోని స్టేషన్ హౌజ్ ఆఫీసర్లు, లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్‌ల అదనపు ఇన్‌స్పెక్టర్‌లకు అధికారం ఇవ్వనున్నట్టు ఉత్తర్వుల్లో వెల్లడించారు. అలాగే నిమజ్జనం కోసం దేవుణ్ణి తీసుకువచ్చే బండిలో కూడా ఎలాంటి మత్తు పదార్ధాలు కనిపించినా చర్యలు ఉంటాయి అని స్పష్తమ్ చేసారు పోలీసులు.

Read Also: CM Revanth Reddy POWERFULL Speech : ఎవడ్రా విగ్రహం తొలగించేది.. ఒక్కడు రండి..? – సీఎం రేవంత్ మాస్ వార్నింగ్