తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం(Congress)పై ప్రతిపక్ష బీఆర్ఎస్(BRS) నేతలు చేస్తున్న విమర్శలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) తీవ్రంగా స్పందించారు. “ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూలగొడతామంటూ కేసీఆర్ అనుచరులు పగటి కలలు కంటున్నారు” అంటూ ఆయన మండిపడ్డారు. ములుగు జిల్లా వెంకటాపూర్‌లో జరిగిన రెవెన్యూ సదస్సులో మంత్రి సీతక్కతో కలిసి పాల్గొన్న పొంగులేటి, ఎమ్మెల్యేలను కొనాలన్న ఆలోచన బీఆర్ఎస్‌కు ఉన్నా అది సాధ్యపడదన్నారు. ప్రజలు ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో తిరస్కరించిన ఇప్పటికీ బుద్ధి రాలేదని వ్యాఖ్యానించారు.
JEE Main Final Answer Key: జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఫైనల్ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
భూ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన “భూ భారతి” చట్టం ప్రజల పక్షాన నిలబడిందని మంత్రి స్పష్టం చేశారు. గతంలో ధరణి గురించి ఎక్కడైనా ఇలాంటి రెవెన్యూ సదస్సులు పెట్టారా? అని ప్రశ్నిస్తూ, భూ భారతిలో అధికారుల తప్పులపై అప్పీల్ చేసుకునే సదుపాయం కల్పించామని తెలిపారు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ల్యాండ్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేసి ప్రజల శబ్దానికి న్యాయం చేసే విధంగా వ్యవస్థను రూపొందించామని వెల్లడించారు.
భూ భారతిపై అసెంబ్లీలో అనవసరంగా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించిన పొంగులేటి, వీధి రౌడీలా వ్యవహరిస్తున్న బీఆర్ఎస్ సభ్యులపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. పేదల కన్నీటిని తుడిచేందుకు ఈ చట్టాన్ని తెచ్చామని, మున్ముందు కూడా పేదల భూముల కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. రైతుల కోసం మేలు చేసేటప్పుడు గతంలో ఈ స్థాయిలో ఎప్పుడైనా రైతు సదస్సులు పెట్టారా? అని ప్రశ్నిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అంకితమైనదని హోదా ఇచ్చారు.