Site icon HashtagU Telugu

Hydra : ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరా? : హైడ్రా పై హైకోర్టు ఆగ్రహం

Will you change no matter how many times you say it? : High Court's wrath on Hydra

Will you change no matter how many times you say it? : High Court's wrath on Hydra

Hydra: నిర్మాణాల కూల్చివేతల వ్యవహారంలో హైడ్రా అనుసరిస్తున్న తీరుపై మరోసారి తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సెలవు రోజుల్లో కూల్చివేతలు చేపట్టవద్దని ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరా? అని హైడ్రా మీద సీరియస్ అయ్యింది. మీరేమన్న దోపిడి దొంగలా? సెలవు రోజుల్లో, తెల్లవారుజామున కూల్చివేతలు ఎందుకు అంటూ హైడ్రాను హైకోర్టు నిలదీసింది. జీవో 99కు విరుద్ధంగా వెళితే దాన్ని రద్దు చేసి హైడ్రాను మూసివేయడానికి ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది.

Read Also: KTR : హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన కేటీఆర్

హైడ్రాను అడ్డుపెట్టుకుని కొంత మంది వ్యక్తిగత కక్షలతో ఆరోపణలు చేస్తున్నారని వాటి ఆధారంగా కూల్చివేతలు చేపట్టడం సరికాదన్నారు. రాత్రికి రాత్రి హైదరాబాద్‌ను మార్చేద్దాం అని కలలు కంటున్నారా? అని హైకోర్టు ప్రశ్నించింది. పత్రాలు పరిశీలించి భూ యాజమాన్య హక్కులు నిర్ణయించడానికి మీరెవరు? హైడ్రాకు ఉన్న అధికారాలు ఏంటో తెలుసా మీకు? పద్ధతి మార్చుకోకపోతే జీవో 99 రద్దు చేసి హైడ్రాను ముసేస్తాం జాగ్రత్తా? అంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను హైకోర్టు హెచ్చరించింది. చట్టప్రకారం కూల్చివేతలు చేపట్టాలని ఎన్నిసార్లు చెప్పినా తీరు మారదా అంటూ ప్రశ్నించింది.

కాగా, సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ముత్తంగి గ్రామంలో తన స్థలానికి సంబంధించి సమర్పించిన వివరాలను పరిశీలించకుండా షెడ్‌ను కూల్చివేశారని పేర్కొంటూ హైకోర్టులో ఎ.ప్రవీణ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ విచారణ చేపట్టారు. హైకోర్టు ఆదేశాల మేరకు హైడ్రా ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌ విచారణకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పార్కు స్థలంలో నిర్మాణాలు చేపడుతున్నారంటూ గాయత్రి మెంబర్స్‌ అసోసియేషన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా కూల్చివేతలు చేపట్టిందని తెలిపారు.

Read Also: Sankranthiki Vasthunam : ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’..