TPCC Chief: రేవంత్ పని ఖతమేనా ?

ఏఐసీసీ తరహాలోనే తెలంగాణలో కూడా కాంగ్రెస్ చింతన్ శిబిర్ నిర్వహించాలని టీ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.

  • Written By:
  • Updated On - May 28, 2022 / 10:37 PM IST

ఏఐసీసీ తరహాలోనే తెలంగాణలో కూడా కాంగ్రెస్ చింతన్ శిబిర్ నిర్వహించాలని టీ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. జూన్ ఒకటి, రెండు తేదిల్లో ఈ సమావేశాలను నిర్వహించాలని టీ కాంగ్రెస్ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో పార్టీ నిర్మాణం, కార్యచరణ, దిద్దుబాటు చర్యలపై సమీక్ష చేపట్టనున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ అద్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన ఇండియా వచ్చిన తర్వాత ఈ సమావేశాలను నిర్వహిద్దామని ఆయన చెబుతున్నా మిగతా కాంగ్రెస్ నాయకులు మాత్రం రేవంత్ లేకపోయినా సభలను నిర్వహిద్దాం అనుకుంటున్నారు. సీఎల్పీ నాయకుడు బట్టి అద్వర్యంలో జరగనున్న ఈ సమావేశాలకు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం టాగోర్ హాజరవనున్నారని సమాచారం. ఈ సమావేశాల్లో రేవంత్ తీరుపై, ముఖ్యంగా ఆయన చేసిన రెడ్ల చేతిల్లోనే అధికారం ఉండాలన్న స్టేట్మెంట్ పై చర్చ జరిగే అవకాశముంది. ఆయనకి వ్యతిరేకంగా ఏదయినా తీర్మానం చేసే అవకాశముంది.