DK Shivakumar: ‘హైదరాబాద్, బెంగళూరు’పై ట్వీట్స్ వార్!

గత కొన్నిరోజులుగా బెంగళూరు సిటీ దేశవ్యాప్తంగా  చర్చనీయాంశమవుతోంది.

  • Written By:
  • Publish Date - April 4, 2022 / 02:45 PM IST

గత కొన్నిరోజులుగా బెంగళూరు సిటీ దేశవ్యాప్తంగా  చర్చనీయాంశమవుతోంది. హిజాబ్, హలాల్ వివాదం ముగిసిపోతున్న తరుణంలో తాజాగా మరో అంశం హాట్ టాపిక్ గా మారింది. Housing.com, Khatabook సహ వ్యవస్థాపకుడు, వ్యవస్థాపకుడు రవీష్ నరేష్ బెంగళూరులో పౌర సౌకర్యాల కొరత గురించి ట్విట్టర్ వేదికగా తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. దేశంలో స్టార్టప్‌లు ఇప్పటికే బిలియన్ల డాలర్ల ఆదాయం తెచ్చిపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో అధ్వాన్నమైన రోడ్లు, విద్యుత్ కోతలు, నాణ్యత లేని నీటి సరఫరా, ఉపయోగించలేని ఫుట్ పాత్‌లు ఉన్నాయి. భారతదేశంలోని సిలికాన్ వ్యాలీ (బెంగళూరు) కంటే చాలా గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన మౌలిక సదుపాయాలున్నాయి” అని నరేష్ ట్వీట్ చేశారు.

“అలాగే సమీపంలోని విమానాశ్రయం కు వెళ్లాలంటే మూడు గంటల కంటే ఎక్కువ సమయం ప్రయాణించాల్సి వస్తోంది” అన్నారాయన. ఈ ట్వీట్‌పై కేటీఆర్ స్పందిస్తూ.. “మీ బ్యాగ్‌లు సర్దుకుని హైదరాబాద్‌కు వచ్చేయండి! ఇక్కడ మెరుగైన మౌలిక సదుపాయాలున్నాయి.  హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ ఉత్తమమైన వాటిలో ఒకటి. ఇక్కడి వసతులు (గాలి, నీరు, భూమి) కంపెనీలకు అనుకూలం. పెట్టుబడులను ఆకర్షించడంలో హైదరాబాద్ ముందుంది‘‘ అంటూ కేటీఆర్ చేసిన ట్వీట్ కర్నాటకలోని కాంగ్రెస్ నేతలతో సహా పలువురిని ఆకర్షించింది.

ఇదే విషయమై అంశంపై కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కెపిసిసి) చీఫ్ డికె శివకుమార్ “మిత్రమా, నేను మీ సవాలును అంగీకరిస్తున్నాను. 2023 చివరి నాటికి, కర్ణాటకలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుంది. అప్పుడు మేం భారతదేశంలోనే అత్యుత్తమ నగరంగా బెంగళూరు కీర్తిని పునరుద్ధరిస్తాం’’ అంటూ స్పందించారు. వెంటనే కేటీఆర్ రియాక్ట్ అవుతూ… కర్ణాటక రాజకీయాల గురించి నాకు పెద్దగా తెలియదు, ఎవరు గెలుస్తారు కానీ సవాల్‌ని స్వీకరిస్తున్నాం. హైదరాబాద్, బెంగళూరు మన యువకులకు ఉద్యోగాలు సృష్టించడం, మన గొప్ప దేశం కోసం శ్రేయస్సు కోసం ఆరోగ్యంగా పోటీ పడనివ్వండి. హిజాబ్‌లపై కాకుండా మౌలిక సదుపాయాలు, IT&BTపై దృష్టి పెడతాం అని బదులిచ్చారు.