Site icon HashtagU Telugu

Rajasingh: బీజేపీ గోషామహల్ బరిలో రాజాసింగ్ నిలిచేనా

Rajasingh

Rajasingh

Rajasingh: బీజేపీ ఫైర్ బ్రాండ్ రాజాసింగ్ బీజేపీ నుంచి బరిలో దిగుతారా? లేదా అనేది సందేహంగా మారింది. సాధార‌ణ ఎన్నిక‌ల్లో జ‌హీరాబాద్ ఎంపీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాల‌ని రాజాసింగ్‌కు బీజేపీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసిన‌ప్పటికీ దానికి రాజాసింగ్ సుముఖంగా లేడని స‌మాచారం. గోషామ‌హ‌ల్ నుంచి పోటీ చేస్తాన‌ని, ఇక్క‌డ్నుంచి మరో నియోజకవర్గానికి వెళ్లే ప్ర‌స‌క్తే లేద‌ని స్ప‌ష్టం చేసిన‌ట్లు తెలుస్తోంది. ఎన్ని బుజ్జగింపులు చెప్పినప్పటికి రాజాసింగ్ మాత్రం ఈ విషయంలో మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారు అని తెలుస్తోంది.

గోషామ‌హ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో రాజాసింగ్‌కు మంచి ప‌ట్టుంది అని బీజేపీ అధిష్ఠనంతో సహ అందరికి తెలిసిందే. మ‌ద్ద‌తుదారులు కూడా ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని వ‌దిలి ఎక్క‌డికి వెళ్లొద్ద‌ని రాజాసింగ్ కు సూచించిన‌ట్లు స‌మాచారం. తాజాగా గోషామహల్ లో రాజాసింగ్ మీడియాతో మాట్లాడారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీజేపీ క్యాండిడేట్ల ఫస్ట్ లిస్ట్ లో తన పేరు ఉంటుందని ఎమ్మెల్యే రాజాసింగ్ ధీమ వ్యక్తం చేశారు.

కాగా గతంలో అసెంబ్లీ వేదికగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో తన స్థానంలో ఎవరు గెలుస్తారో తెలియదని రాజాసింగ్ పేర్కొన్నారు. తాను మాత్రం తిరిగి అసెంబ్లీకి రాననే నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు. తాను అసెంబ్లీలో అడుగు పెట్టకుండా తన చుట్టూ చాలా రాజకీయాలు జరుగుతున్నాయని ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు.