కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత ,ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) పిలుపుతో శుక్రవారం రాత్రి ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth), శనివారం రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో మంత్రివర్గ విస్తరణ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మరియు ఇతర ముఖ్యమైన అంశాలపై చర్చలు జరగనున్నాయి. మంత్రివర్గ విస్తరణతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పూర్తి చేసిన కులగణన మరియు ఎస్సీ వర్గీకరణపై తీసుకున్న నిర్ణయాలు, సర్వే పూర్తి అయ్యాక దానికి చట్టబద్దత కల్పించి కేంద్రానికి పంపించడం, స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా, పీసీసీ కార్యవర్గం ఖరారు, నామినెటెడ్ పోస్టుల భర్తీ తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చలు జరగనున్నట్లు తెలుస్తుంది. మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఓసీల నుంచి స్థానం కల్పించాల్సి అవసరం ఎంతో ఉండడంతో విస్తరణ అనేది ఆలస్యం అవుతూ వస్తుంది.
Sant Sevalal Maharaj Jayanti : ప్రత్యేక సెలవు
ఇప్పటికే తెలంగాణ నుంచి వెళ్లిన జాబితాను చివరిసారిగా పరిశీలించి, సీఎం రేవంత్ మరియు రాహుల్ గాంధీ చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రివర్గంలో ఎవరికి చోటు కల్పించబడుతుందో ఖరారు అయ్యే అవకాశం ఉంది. మంత్రివర్గంలో చోటు కల్పించబడని వారికి కీలకమైన కార్పొరేషన్లు మరియు చైర్ పర్సన్లుగా నియమించడం, పీసీసీ రాష్ట్ర కార్యవర్గంలో బాధ్యతలు అప్పజెప్పేలా ఏఐసీసీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ మరియు రేవంత్ రెడ్డి మధ్య జరగనున్న ఈ సమావేశం రాష్ట్ర రాజకీయాలలో కొత్త మలుపును తిప్పే అవకాశం ఉంది.