Hyderabad: మత రాజకీయాలు..అసదుద్దీన్ పూర్వీకులు మహారాష్ట్ర నుంచి వచ్చారా?

తెలంగాణాలో కాంగ్రెస్ ఎంఐఎం పార్టీల మధ్య మత వివాదాలు చెలరేగుతున్నాయి. ఇరు పార్టీలు మతాన్ని తెరపైకి తీసుకొస్తూ రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఎంఐఎం వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది

Hyderabad: తెలంగాణాలో కాంగ్రెస్ ఎంఐఎం పార్టీల మధ్య మత వివాదాలు చెలరేగుతున్నాయి. ఇరు పార్టీలు మతాన్ని తెరపైకి తీసుకొస్తూ రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఎంఐఎం వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది.సిద్ధాంత విభేదాల కారణంగానే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీని వీడారని, ఆయనను భాగ్యలక్ష్మి గుడికి రప్పించేందుకు సిద్ధమని టీపీసీసీ అధికార ప్రతినిధి సయ్యద్‌ నిజాముద్దీన్‌ అన్నారు . మజ్లీస్ నాయకులు మక్కా మసీదుకు వచ్చి తమ పూర్వీకులు మహారాష్ట్ర నుంచి రాలేదని ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై ఏఐఎంఐఎం నేతలు అసదుద్దీన్ ఒవైసీ , అక్బరుద్దీన్ ఒవైసీ దూషణలను, కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

ఈరోజు గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నిజానికి ఎంఐఎం చరిత్ర తెలంగాణ విద్రోహ చరిత్ర అని అన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతున్న నాడు నిజాం సర్కార్‌కు మద్దతుగా ఎంఐఎం దుష్టపాత్ర పోషించింది. షేక్‌ బందగీ, షోయాబుల్లాఖాన్‌, ముక్దూం మొహియుద్దీన్‌లు తెలంగాణ పేదల పక్షాన నిలిచి అమరులైనప్పుడు ఎంఐఎం మతోన్మాద ధోరణితో భూస్వాముల కోసం రజాకార్ల పేరుతో సామాన్య ప్రజలను పొట్టన పెట్టుకుందని సంచలన ఆరోపణలు చేశారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పార్లమెంటులో వ్యతిరేకించింది అదే ఎంఐఎం అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా శ్రీకృష్ణ కమిటీకి నివేదిక ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ ముస్లిం సమాజంతో పాటు ఇతర సంఘాలు పోరాడుతుండగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు మజ్లీస్ పార్టీ కార్యకలాపాలు చేసిందన్నారు . ఎంఐఎం తెలంగాణ ముస్లింల మనోభావాలను పట్టించుకోకుండా రాయల తెలంగాణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా 48 గంటల బంద్‌లో పాల్గొంది . నిజానికి ఓల్డ్ సిటీలో ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తే ఎంఐఎం అడ్రస్ ఉండక పోవడం ఖాయమన్నారు.

రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలపై చేస్తున్న ఆరోపణలు వారిలోని అభద్రతాభావాన్ని, ఓటమి భయాన్ని తెలియజేస్తున్నాయి. మతం పేరుతో ప్రజలను దోచుకుంటున్న దొంగల డ్రామాలో ఒవైసీ బ్రదర్స్, బీజేపీ నాటకాలాడుతున్నారని ఆరోపించారు.

Also Read: Sikkim: సిక్కిం వరదల్లో అలనాటి నటి ఆచూకీ గల్లంతు!