Polling Vs Rain : తెలంగాణలో పోలింగ్ రోజున వాన పడుతుందా ?

Polling Vs Rain :  తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబరు 30న(గురువారం) ఉంది.

Published By: HashtagU Telugu Desk
Polling Vs Rain

Polling Vs Rain

Polling Vs Rain :  తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబరు 30న(గురువారం) ఉంది. ఆ రోజున వాన పడుతుందా ? వాన పడదా ? అనే దానిపైనా డిస్కషన్ నడుస్తోంది. వెదర్ రిపోర్టు ప్రకారం.. ఈశాన్య రుతుపవనాల ప్రభావం, బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పవాయు పీడనం కారణంగా ఈ నెల 29 వరకు ఉత్తర తెలంగాణ జిల్లాలపై వర్ష ప్రభావం కొంతమేర ఉంటుంది. ప్రత్యేకించి ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్‌, నల్గొండ, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జనగాం పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురవొచ్చని వాతావరణ నిపుణులు తెలిపారు. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం కూడా ఉందని చెప్పారు.  పోలింగ్‌కు ఒకరోజు ముందు తేదీ (బుధవారం) వరకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజ్‌గిరిల్లోనూ అక్కడక్కడ ఓ మోస్తరు వాన పడే ఛాన్స్ ఉందన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా భారత వాతావరణ విభాగం (ఐఎండీ) విడుదల చేసిన శాటిలైట్ అంచనాల ప్రకారం.. ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు రాయలసీమ ప్రాంతంలో చిరు జల్లులు కురుస్తాయి. మిగతా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా వర్ష సూచన లేదు. మేఘాలు కూడా తక్కువగానే ఉంటాయి. రాయలసీమతో పోలిస్తే తెలంగాణ, ఉత్తరాంధ్రలో ఎండ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. మలేషియా దేశం దగ్గర ప్రస్తుతం ఓ తుఫాను ఏర్పడుతోంది. దాని ప్రభావం వల్ల మేఘాలు మన దేశం వైపు వస్తే కనుక.. పోలింగ్ జరిగే రోజు (నవంబరు 30న) వానలు కురిసే అవకాశం(Polling Vs Rain) ఉంటుంది.

  Last Updated: 27 Nov 2023, 07:35 AM IST