Site icon HashtagU Telugu

KTR: నచ్చకుంటే అన్ ఫాలో చేయండి!

Ktr

Ktr

నా పోస్టులు మీకు నచ్చకుంటే…అన్ ఫాలో చేయండి…తెలంగాణకు కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ఎండగడుతూనే ఉంటాం..అంతే…అని అన్నారు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. కొన్ని నెలలుగా కేంద్రానికి తెలంగాణకు మధ్య పోరు అన్నట్లుగా సాగుతున్న విషయం తెలిసిందే. వరిధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం తెలంగాణకు ఎంతో అన్యాయం చేస్తోందన్ని సీఎం కేసీఆర్ ఆరోపించారు. అంతేకాదు కేంద్రం తీరును ఎప్పటికప్పడు ఎండగడుతూనే ఉండాలని పిలుపునిచ్చారు. అప్పటి నుంచి బీజేపీ వర్సెస్ టీఆరెస్ నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. సోషల్ మీడియా వేదికగా ఒకరిమీద ఒకరు విమర్శలు చేసుకుంటూ..రాష్ట్రంలో రాజకీయ కాక పుట్టిస్తున్నారు.

ఇప్పుడు పెరుగుతున్న పెట్రోల్ డీజీల్ ధరలపై టీఆరెస్ ఆందోళనలు చేస్తోంది. మోదీ పాలనలో పెట్రోలు ధరలు భారీగా పెరిగాయంటూ ఆరోపిస్తుంది. బీజేపీ నేతలేం తక్కువ కాదు…రాష్ట్రంలో ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలు పెంచారని ఆందోళనలు నిర్వహిస్తోంది. సోషల్ మీడియాను వేదికను చేసుకుని పోస్టులు పెడుతున్నారు. ఇందులో కొంచెం బీజేపీ స్ట్రాంగ్ గా…టీఆరెస్ పై రకరకాలుగా పోస్టులు పెడుతోంది. అటు టీఆరెస్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. బీజేపీకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతూనే ఉంది.

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్…సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ట్విట్టర్ లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే కేటీఆర్…సమస్యలపై స్పందిస్తుంటారు. ఈ మధ్య కాలంలో బీజేపీకి వ్యతిరేకంగా పోస్టులు షేర్ చేస్తున్నారు కేటీఆర్. తాజాగా కమర్షియల్ ఎల్ పీజీ ధరను ప్రభుత్వం పెంచిన తరుణంలో ఓ పోస్టును పెట్టారు కేటీఆర్. దీనికి ఏప్రిల ఫూల్ జోక్ అని పేర్కొంటూ..అచ్చేదిన్ ఏప్రిల్ ఫూల్స్ డేన్ అని కాస్త వ్యంగ్యంగా రిప్లై ఇచ్చారు.

కేటీఆర్ చేసిన ట్వీట్ పై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ దాడితో టీఆరెస్ పని అయిపోయినట్లే అటూ కామెంట్స్ చేస్తున్నారు. నేను ఇచ్చే రిప్లే మీకు నచ్చనట్లయితే..మీరు నన్ను అన్ ఫాలో చేయండి..అంటూ కౌంటర్ ఇచ్చారు. దీంతో ట్విట్టర్ వేదికగా రాజకీయ హీట్ మొదలైంది. తాజాగా కేటీఆర్ చేసిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. కొన్నాళ్లుగా రకరకాల పోస్టులతో కేటీఆర్ తనదైన శైలిలో బీజేపీపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.