Site icon HashtagU Telugu

Telangana BSP: తెలంగాణాలో బీఎస్పీ – కాంగ్రెస్ పొత్తు?

Telangana BSP

New Web Story Copy 2023 06 21t152237.190

Telangana BSP: తెలంగాణ బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చే ఎన్నికల్లో పొత్తుపై క్లారిటీ ఇచ్చారు. బీఎస్పీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునేందుకు సిద్దమైనట్లు గత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. రాజకీయ వర్గాల్లోనూ ఇదే టాపిక్ నడుస్తుంది. అయితే తాజాగా బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు.

ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్దీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు యమజోరుగా సాగుతున్నాయి. అధికారపార్టీ బీఆర్ఎస్ పై విపక్షాలు మూకుమ్మడిగా దాడికి యత్నిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ వ్యూహాలతో సీఎం కెసిఆర్ పాలనపై విమర్శలు చేస్తున్న వేళా తాజాగా బీఎస్పీ వచ్చి చేరింది. తెలంగాణాలో బీఎస్పీ అధికారం చేపట్టబోతున్నట్టు ఆ పార్టీ అధినాయకత్వం చెప్పుకుంటున్నది. ఇదిలా ఉండగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇటీవల కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీ సంపత్ కుమార్‌తో చర్చించినట్లు, కాంగ్రెస్ తో బీఎస్పీ పొత్తుకు రంగం సిద్ధమైనట్టు వార్తలు వైరల్ గా మారాయి. దీంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రియాక్ట్ అయ్యారు.

కాంగ్రెస్ తో బీఎస్పీ పొత్తు అనేది అసత్య ప్రచారమే అని కొట్టిపారేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మేం ఏ కాంగ్రెస్‌ నేతలతోనూ ఎన్నికల గురించి చర్చించలేదు. తెలంగాణలో బహుజన సమాజ్ పార్టీ సొంత బలంతో ఎన్నికల్లో పోటీ చేస్తుంది. తెలంగాణ బీఎస్పీ ఆ పార్టీ అధినేత మాయావతి ఆదేశాల మేరకు నడుస్తుందని స్పష్టం చేశారు.

Read More: Jagan’s brother in law : బామ్మ‌ర్ది మీద బ్ర‌ద‌ర్ అనిల్ రివ‌ర్స్ పాలిట్రిక్స్