Site icon HashtagU Telugu

BRS – AP : బీఆర్ఎస్‌ ఎదుట బిగ్ క్వశ్చన్స్.. జాతీయ రాజకీయాలా ? రాష్ట్ర రాజకీయాలా ?

Kcr Madhira

Kcr Madhira

BRS – AP : టీఆర్ఎస్ పార్టీ పేరు బీఆర్ఎస్‌గా మారిన తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ  పోల్.. చేదు ఫలితాన్ని ఇచ్చింది. దీంతో పార్టీ పేరు మార్పు కూడా బీఆర్ఎస్‌కు మైనస్ పాయింట్ అయిందా అనే కోణంలో చర్చ మొదలైంది. తెలంగాణ పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక బార్డర్‌లోని అసెంబ్లీ స్థానాలకు బీఆర్ఎస్‌ను విస్తరించాలని తొలుత కేసీఆర్ ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు ఆ ప్లాన్ వర్క్ ఔట్ అవుతుందా ? సొంత రాష్ట్రం తెలంగాణలోనే ఎదురుగాలి వీస్తున్న ప్రస్తుత తరుణంలో పొరుగు రాష్ట్రాలపై ఫోకస్ చేయడం సాధ్యమవుతుందా ? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ఎటువంటి రాజకీయ వ్యూహంతో జనంలోకి వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది.

We’re now on WhatsApp. Click to Join.

ఓ వైపు జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ విస్తరణ.. మరోవైపు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో సాధ్యమైనన్ని ఎక్కువ లోక్‌సభ స్థానాలను గెలుచుకోవడం  అనే అంశాలు ఇప్పుడు గులాబీ పార్టీ పెద్దల ముందు ఉన్నాయి. వీటిలో దేనికి ప్రయారిటీ ఇస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ కేసీఆర్ ఇప్పుడున్న పరిస్థితులలో ఇతర రాష్ట్రాలకు వెళితే అక్కడ ప్రజలు బీఆర్ఎస్‌ను  ఆదరిస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు అరెస్టుపై  హైదరాబాద్‌లో నిరసనలు తెలిపేందుకు కూడా చంద్రబాబు అభిమానులకు కేసీఆర్ హయాంలో అనుమతులు ఇవ్వలేదు. ఈనేపథ్యంలో బీఆర్ఎస్‌ను ఏపీ ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు ? అనే పెద్ద ప్రశ్న ఉదయిస్తోంది.

Also Read: Mizoram CM : మిజోరం సీఎం ఓటమి.. కొత్త సీఎంగా జెడ్‌పీఎం చీఫ్

ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు.. ఇంట్లోనే గెలవని బీఆర్ఎస్ పార్టీ  ఇతర రాష్ట్రాల్లో ఎలా గెలుస్తుంది ? ఎంతమేరకు అక్కడ ప్రభావాన్ని చూపించగలుగుతుంది ? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది. వచ్చే లోక్‌సభ పోల్స్ వరకు బీఆర్ఎస్ పార్టీ జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేయకపోవచ్చని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ బీఆర్ఎస్‌లో పునరుత్తేజం నింపడానికే తొలి ప్రయారిటీ ఇస్తారని విశ్లేషకులు అంటున్నారు. ప్రతిపక్ష హోదాలో ప్రజలలోకి వెళ్లడం ఎలాగో గులాబీ బాస్ కేసీఆర్‌కు బాగా తెలుసు. తన రాజకీయ చతురతతో ఆయన బీఆర్ఎస్‌ను తెలంగాణలో క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు మరోసారి వ్యూహాలను సిద్ధం చేస్తారని రాజకీయ పండితులు(BRS – AP) అంచనా వేస్తున్నారు.

Exit mobile version