BRS Sitting MLAs: సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చే దమ్ము కేసీఆర్ కి ఉందా?

తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తుంటే అధికార పార్టీ బీఆర్ఎస్ మాత్రం మౌనం పాటిస్తుంది. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని ప్రకటించిన కేసీఆర్ ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో సభలు, సమావేశాలు అంటూ తిరుగుతున్నారు.

BRS Sitting MLAs: తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తుంటే అధికార పార్టీ బీఆర్ఎస్ మాత్రం మౌనం పాటిస్తుంది. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని ప్రకటించిన కేసీఆర్ ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో సభలు, సమావేశాలు అంటూ తిరుగుతున్నారు. ఇక ఇదే అదునుగా తెలంగాణ కాంగ్రెస్ చాపకింద నీరులా తమ పార్టీ బలాన్ని విస్తరించుకుంటుంది.

రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాగ్రెస్ పార్టీ పూర్వ వైభవం కనపడుతుంది. ఈ సమయంలో అధికార పార్టీ మౌనంగా ఉండటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దీని వెనుక కేసీఆర్ ఎత్తుగడ ఏదైనా కావచ్చు కానీ పరిస్థితి కాంగ్రెస్ చేతిలోకి వెళితే నష్టం బీఆర్ఎస్ కే కదా అని అభిప్రాయపడుతున్నారు రాజకీయ విశ్లేషకులు.

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇతర పార్టీల నుంచి చేరికల పరంపర కొనసాగుతుంది. ఇప్పటికీ ఆ పార్టీలోకి బలమైన నేతల చేరిక కన్ఫర్మ్ అయింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ గూటికి చేరికలు జరగనున్నట్టు ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించింది.

ఇదిలా ఉండగా వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ కేటాయిస్తుందా లేదా అన్నది అనుమానమే. ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ నేతలపై భూదందాలు, ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా, రియల్ ఎస్టేట్ దందాలు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల సీఎం కెసిఆర్ చేపట్టిన సర్వేలో దాదాపుగా 40 మంది ఎమ్మెల్యేలపై ప్రజలు వ్యతిరేకత చూపిస్తున్నట్టు తేలింది. దీంతో ఇటీవల జరిగిన ప్లీనరీ సమావేశంలో సదరు ఎమ్మెల్యేలకు కెసిఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. తీరు మార్చుకోకపోతే టికెట్ ఇచ్చేది లేదంటూ తెగేసి చెప్పారట. అయితే తెలంగాణాలో ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలలో కొందరికి టికెట్ ఇస్తే ఫలితం మరోలా ఉంటుందనే అభద్రతాభావం బీఆర్ఎస్ అధినాయకత్వంలో కనిపిస్తుంది.

Read More: BRS plan : జ‌గ‌న్ ఫార్ములాతో ఎన్నిక‌ల‌కు కేసీఆర్ సిద్ధం! వ‌చ్చే 6నెల‌లు న‌గ‌దు బ‌దిలీ!!

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ తప్పిదాలను హైలెట్ చేస్తున్నారు. అందులో భాగంగా బీఆర్ఎస్ కి సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటిచ్చే దమ్ము ఉందా కెసిఆర్ అంటూ సవాల్ వదిలారు. మీ ఎమ్మెల్యేలపై నమ్మకం ఉంటె వారికీ సీటిచ్చి చూడు అంటూ సీఎం కెసిఆర్ కి సవాల్ విసిరారు రేవంత్. దీనిపై కెసిఆర్ ఇలాకా నుంచి రిప్లయ్ లేకపోగా సైలెంట్ గా వ్యవహరిస్తున్నారు ఆ పార్టీ నేతలు. కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్టు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇస్తే ఎం జరుగుతుందనే ప్రశ్న ప్రధానంగా వినిపిస్తుంది.

తెలంగాణ మంత్రులు మల్లారెడ్డి, జగదీశ్ రెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, పైల శేఖర్ రెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా నాగేశ్వర రావు ఇలా అనేక మంది బీఆర్ఎస్ నేతలపై అవినీతి లేదా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. ఇక జిల్లా స్థాయిలోను బీఆర్ఎస్ నాయకులపై కెసిఆర్ గుర్రుగా ఉన్నట్టు తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఇలాంటి నేతలకు టికెట్లు ఇస్తే ఓటమి తప్పదనే విషయం ఆ పార్టీలోని కొందరు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. దీనిపై త్వరలోనే కెసిఆర్ నిర్ణయం తీసుకోనున్నట్టు కూడా విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలపై మరోసారి సర్వే చేపట్టి అందులోని గెలుపు గుర్రాలకే టికెట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే రేవంత్ సవాల్ ని బీఆర్ఎస్ పెద్దగా పరిగణలోకి తీసుకోకుండా తమ పని చేసుకుంటూ పోవాలన్నదే వారి రాజకీయ ఎత్తుగడగా తెలుస్తుంది.

Read More: 3 Killed : నాగ్‌పూర్‌లో అదృశ్య‌మైన ముగ్గురు చిన్నారులు.. రెండు రోజులు త‌రువాత‌..?