Site icon HashtagU Telugu

Phone Tapping Case: కేటీఆర్‌కు లై డిటెక్టర్ పరీక్షకు కాంగ్రెస్ సిద్ధం…

Phone Tapping Case

Phone Tapping Case

Phone Tapping Case: తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వివాదం తారాస్థాయికి చేరింది. మొదట్లో సాధారణ ఇష్యూగా భావించినప్పటికీ ఈ ట్యాపింగ్ ద్వారా అనేక కుంభకోణాలు వెలుగు చూశాయి. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఓ కానిస్టేబుల్ కొందరు అమాయక మహిళలను ట్రాప్ చేసి లొంగదీసుకున్నాడు. అంతేకాదు రాజకీయంగా చాలానే జరిగాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఫోన్లు చేసి భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశారు. ఇందులో బీఆర్ఎస్ లో పెద్ద స్థాయి వక్తుల హస్తం ఉంది. ఫోన్ ట్యాపింగ్ వివాదంలో కేటీఆర్ కీలక వ్యక్తి అంటూ అధికార పార్టీ ఆరోపిస్తుంది. దీనిపై కేటీఆర్ కూడా స్పందించారు. ఏకంగా లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధం అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడిదే చర్చనీయాంశమైంది.

ఫోన్ ట్యాపింగ్ కుంభకోణంపై కేటీఆర్ ‘లై డిటెక్టర్ టెస్ట్’ చేయించుకుంటానని చెప్పడంతో కాంగ్రెస్ ఎద్దేవా చేస్తుంది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కేకే మహేందర్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు పరీక్షకు అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. కేటీఆర్ ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శిస్తున్నారు. ఎందుకంటే గతంలో కేటీఆర్ డ్రగ్స్ విషయంలో ఈ తరహా కామెంట్స్ చేయలేదని చెప్తున్నారు.

We’re now on WhatsApp : Click to Join

లై డిటెక్టర్ పరీక్షను ఎదుర్కొంటాడనే వాదన అతనికి సరిపోదన్నారు. అయినప్పటికీ కేటీఆర్ ఈ పరీక్షకు సిద్ధపడితే ఖచ్చితంగా మేము చట్ట పరిధిలో దానికి సంబందించిన ఏర్పాటు చేస్తామన్నారు. గతంలో రేవంత్ రెడ్డి డ్రగ్స్ పరీక్షకు డిమాండ్ చేయగా కేటీఆర్ దానికి సిద్ధమని చెప్పలేకపోయాడని, ఇప్పుడు లై డిటెక్టర్ పరీక్షకు రెడీ అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందంటూ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా ఫోన్ ట్యాపింగ్ వివాదంపై కేటీఆర్ నుంచి లీగల్ నోటీసు అందుకున్న మహేందర్ రెడ్డి.. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును ఎలా అరెస్టు చేశారో చెప్పుకొచ్చాడు. ఏదేమైనా లోకసభ ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ వివాదం మరింత ఘాటుగా మారే అవకాశం ఉంది.

Also Read: Dr BR Ambedkar: డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ చెప్పిన‌ 10 స్ఫూర్తిదాయకమైన కోట్స్ ఇవే..!

Exit mobile version