Site icon HashtagU Telugu

Wife Kills Husband : భర్తను నరికి చంపిన ఇద్దరు భార్యలు

Wife Kills Husband

Wife Kills Husband

జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం పిట్టలోనిగూడె గ్రామంలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన ఇద్దరు భార్యల చేతిలో హత్యకు గురయ్యాడు. మృతుడిని కాలియా కనకయ్య (30)గా గుర్తించారు. అతడికి శిరీష, గౌరమ్మ అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. వీరిద్దరూ అక్కాచెల్లెలు కావడం గమనార్హం.

ఈ మధ్య కనకయ్య తన భార్యల తల్లిని హత్య చేశాడన్న ఆరోపణలపై జైలు శిక్ష అనుభవించాడు. ఈ కారణంగా భార్యలు తమ పుట్టింటికి వెళ్లి అక్కడే నివసిస్తూ ఉన్నారు. జైలు నుంచి విడుదలైన అనంతరం కనకయ్య తిరిగి తన భార్యలను ఇంటికి తీసుకురావాలని ట్రై చేసాడు. అయితే భార్యలు తిరిగి అతనితో కాపురం చేయడానికి నిరాకరించారు.

Jamili Elections : 2027 ఫిబ్రవరి నెలలో జమిలి ఎన్నికలు – ప్రహ్లాద్ జోషి

ఈ క్రమంలో భార్యలను బెదిరిస్తూ, ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేసిన కనకయ్యపై వారు కోపోద్రిక్తులయ్యారు. ఆయన వ్యవహారం రోజు రోజుకు హద్దులు మీరుతుండటంతో శిరీష, గౌరమ్మ కలిసి ఘాతుకానికి పాల్పడ్డారు. గొడ్డలితో అతనిపై దాడి చేసి అతి దారుణంగా నరికి చంపారు. ఈ దాడిలో ఆయన తల మొండం వేరు వేరుగా విడిపోయాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ సంఘటన గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. కుటుంబ కలహాలు ఎంత తీవ్ర స్థాయికి వెళ్లొచ్చో ఈ ఘటన మరోసారి నిదర్శనం అయింది.