తెలంగాణలో ఇటీవల కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య ఘర్షణలు తీవ్రమైన పరిణామాలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా అక్రమ సంబంధాలు (Illegal Relationship) హత్యలకు దారి తీస్తున్నాయి. తాజాగా మహబూబాబాద్ జిల్లా గడ్డిగూడెం తండాలో జరిగిన ఘటన అందుకు నిదర్శనం. ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తపై దాడి చేసి చెవులు కోసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
అలాగే గద్వాల జిల్లా మల్దకల్ మండలం మల్లెందొడ్డి గ్రామంలో కూడా ఇటువంటి విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఈ నెల 11న పద్మ అనే మహిళ తన భర్త వెంకటేశైపై కాగుతున్న వేడి నూనె పోయడం జరిగింది. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వెంకటేశై ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఆలస్యంగా బయటపడటంతో మరింత సంచలనం రేపింది.
Amaravati : అమరావతి ఐకానిక్ వంతెన మోడల్ ఇదే
ఇలాంటి సంఘటనలు వివాహేతర సంబంధాలు, ఆవేశపూరిత నిర్ణయాలు కుటుంబాలను నాశనం చేస్తున్నాయి అనే వాస్తవాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. చిన్నపాటి తగాదాలు, అనుమానాలు పెద్ద సమస్యలుగా మారి ప్రాణాలకే ముప్పు తెచ్చిపెడుతున్నాయి. గృహహింస, అనుమానాస్పద ప్రవర్తన, విశ్వాస లోపం వలన ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని పోలీసులు చెబుతున్నారు. భావోద్వేగ నిర్ణయాలు కుటుంబాలను ఛిన్నాభిన్నం చేయడమే కాకుండా, నిరపరాధ చిన్నారుల భవిష్యత్తును కూడా అంధకారంలోకి నెడతాయి. అందువల్ల భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని, సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.