YS Sharmila: పాలేరు బరిలో షర్మిల.. ప్రధాన కారాణాలివే!

వైఎస్ షర్మిల (YS Sharmila) ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేయడానికి ప్రధాన కారాణాలున్నాయి. అవేంటో తెలుసా?

  • Written By:
  • Updated On - December 20, 2022 / 04:08 PM IST

తెలంగాణ (Telangana)లో రాజకీయ అరంగేట్రం చేస్తున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె అయిన షర్మిల ఖమ్మంలో తన క్యాంపు కార్యాలయానికి శంకుస్థాపన చేసి గత వారం ఈ ప్రకటన చేశారు. తన హయాంలో పాలేరు (Palair) రిజర్వాయర్‌కు మరమ్మత్తులు చేసి నియోజకవర్గంలో 20 వేలకు పైగా ఇళ్లను నిర్మించి ఈ ప్రాంత ప్రజల కోసం దివంగత తన తండ్రి ఎంతో కృషి చేశారు. ఇప్పటికే షర్మిల తాను పాలేరు కూతురినని ప్రకటించిన విషయం తెలిసిందే.

పాలేరు నుంచి పోటీ చేయాలని షర్మిల (YS Sharmila) తీసుకున్న నిర్ణయం తెలంగాణ రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్న ఎవరికైనా ఆశ్చర్యం కలిగించలేదు. ఆమె ఎన్నికల ప్రచారం కూడా ఖమ్మం ప్రాంతంపైనే ఎక్కువగా కేంద్రీకృతమైంది. రాజకీయ అరంగేట్రం చేయడానికి “సాఫ్ట్” సీటును ఎంచుకున్నట్లు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఏడాది క్రితమే పార్టీ పెట్టిన షర్మిలకు ఖమ్మం జిల్లా నుంచి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

రాజకీయ విశ్లేషకుడు కె నాగేశ్వర్ అభిప్రాయం ప్రకారం.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పటికీ, ఖమ్మం జిల్లా అందుకు మినహాయింపుగా ఉంది. ఈ జిల్లా ఏపీకి సమీపాన ఉండటంతో తెలంగాణ సెంటిమెంట్ ఎక్కువగా వర్కౌట్ కాలేదు. ఈ అంశాలతో పాటు, వైఎస్ అభిమానులు కూడా ఉన్నారు. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ (BRS) పార్టీ విజయం సాధించడం అంత సులువు కాదని కూడా తెలుస్తోంది.

2014 ఎన్నికల్లో ఖమ్మం నుంచి బీఆర్‌ఎస్‌కు మంచి ఫలితాలు రాలేదు. ఈ లోటును భర్తీ చేసేందుకు తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ వంటి నేతలను పార్టీలోకి తీసుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. బీఆర్‌ఎస్‌కు ఖమ్మం ఎప్పుడూ సవాలుతో కూడుకున్న జిల్లా’’ అని నాగేశ్వర్ చెప్పారు. షర్మిల (YS Sharmila) పాలేరు నుంచి పోటీ చేస్తారని ఇప్పటికే ప్రకటించింది. అయితే ఇప్పటికే తెలంగాణలో షర్మిలపై ‘‘ఆంధ్రా బిడ్డ” అనే పేరుంది. అయితే షర్మిలకు నేటివిటీకి పాలేరు లో పెద్దగా సమస్యగా ఉండదు. ఆమె పాలేరు ఎంచుకోవడానికి మరొక కారణం వైఎస్ పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం. వైఎస్ (YSR) రాజశేఖరరెడ్డి చాలా మంచి పనులు చేశారు. ఆయనకు ఎంతో గౌరవం ఉందన్నారు. ఇవన్నీ షర్మిలకు కలిసొచ్చే అంశాలన్నీ రాజకీయ వర్గాలు సైతం అభిప్రాయపడుతున్నాయి.

Also Read:BRS MLA Rohith Reddy: రోహిత్ రెడ్డికి కేసీఆర్ ‘లీగల్’ సపోర్ట్