Site icon HashtagU Telugu

Bandla Ganesh: పవర్ లేనివారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఎందుకు? కేటీఆర్ పై బండ్ల ఫైర్

Bandla Ganesh

Bandla Ganesh

Bandla Ganesh: సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ బీఆర్ఎస్ పార్టీ పై మరోసారి విరుచుకుపడ్డారు. గత పదేళ్లలో బీఆర్ ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని సవాల్ విసిరారు. మాజీ మంత్రి కేటీఆర్ విడుదల చేసిన స్వేద పత్రంపై ఆయన ఘాటుగా స్పందించారు. అధికారం లేని వారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. ఏం చేశారో, ఎంత దోచుకున్నారో, ఆర్థికంగా ఏ స్థాయి నుంచి వచ్చారో చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు ఎంత వెనుకబడి ఉన్నారో తాము చెప్పగలమని అన్నారు.

ప్రజలు తాము చెప్పిన మాటలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారని అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి నెల కూడా కాలేదు, బీఆర్‌ఎస్‌కి ఎందుకు అంత బాధ, భయం. కొంత సమయం ఇవ్వండి, కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా పరిపాలిస్తుంది అని ఆయన అన్నారు. ఇక బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణంలో లోపాలు ఉంటే ఎలాంటి విచారణైనా చేపట్టవచ్చునని, అందుకు తాము సిద్ధమేనని కేటీఆర్ ఉద్ఘాటించారు. రాజకీయ స్వప్రయోజనాలకు ప్రాజెక్టులను బద్నాం చేయొద్దని, ప్రాజెక్టులపై బురదచల్లొద్దని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

బీఆర్‌ఎస్‌ హయాంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిని వివరిస్తూ రూపొందించిన స్వేదపత్రం విడుదల సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నాటికి ప్రాజెక్టులు పూర్తికాక, సాగునీళ్లు లేక వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని గుర్తుచేశారు. ఒక్క మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచే 14 లక్షల మంది వలస పోయారంటే అనాటి పరిస్థితులను అర్దం చేసుకోవచ్చని అన్నారు.