కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను ఎనుముల రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేపట్టిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ (Congress Party ) తిరిగి పుంజుకుంది. అందరినీ ఆశ్చర్యపరుస్తూ కాంగ్రెస్ పార్టీకి అసాధ్యమనుకున్న అధికారాన్ని సాధించగలిగారు. కానీ, సీఎంగా ఉంటూ కూడా రేవంత్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పదవిని పొందినప్పటికీ, పార్టీలో మరియు ప్రభుత్వంలో తాను అనుకున్న విధంగా వ్యవహరించలేకపోతున్నానన్న భావన ఆయనలో ఉందని ఆయన స్వయంగా వెల్లడించారు.
ప్రభుత్వ వ్యవహారాల్లో అసంతృప్తి
తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా తన తీసుకునే నిర్ణయాలు సమర్థవంతంగా అమలవడం లేదన్న భావన ఆయనలో ఉందనేది స్పష్టమైంది. తన సూచనలు కొంతవరకు పాటించబడుతున్నా, అన్నీ తానే చెప్పినట్లు నడవకపోవడం వల్ల కాస్త అసంతృప్తికి గురి అవుతున్నారు. తనకు అనేక ప్రాక్టికల్ సమస్యలు ఎదురవుతున్నాయని, తన సూచనలను పక్కనపెట్టి కొన్ని వ్యవహారాలు ముందుకు సాగుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
రాహుల్ గాంధీ ప్రధాని అవ్వాలన్న లక్ష్యం
తన అసంతృప్తిని వ్యక్తం చేసిన రేవంత్, ఆ తర్వాత దీన్ని కొంత మేర తగ్గించేలా వ్యాఖ్యలు చేశారు. చిన్న చిన్న ఇబ్బందులు, రాజకీయ ఒత్తిళ్లను పక్కనపెట్టి రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చూడాలన్నది తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రేవంత్ సీఎంగా ఉన్నప్పటికీ, పార్టీ నేతల మధ్య సమన్వయం కొంత అవసరమని, పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాల్సిన సమయం ఇదని తెలియజేశారు. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ మరింత బలోపేతం కావాలంటే సీనియర్ నాయకులు తనపై పూర్తిగా విశ్వాసం పెట్టుకోవాలన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటె సీఎం పేరును పలు కార్యక్రమాల్లో యాంకర్లు , సొంత పార్టీ నేతలు మరచిపోవడం రేవంత్ ను ఇంకాస్త బాధకు గురిచేస్తుంది. సీఎం గా బాధ్యతలు చేపట్టి 15 నెలలు కావొస్తున్నా ఇంకా సీఎం గా తన పేరు ను మరచిపోవడం ఏంటి అని లోలోపల బాధపడుతున్నారు. మొత్తం మీద సీఎం పదవి దక్కినప్పటికీ రేవంత్ మాత్రం సంతృప్తిగా లేరని స్పష్టంగా తెలుస్తుంది.
Trump Vs Zelensky: డొనాల్డ్ ట్రంప్‌తో జెలెన్ స్కీ వాగ్వాదం.. కారణం ఇదీ