KTR On Valmiki Scam: దేశవ్యాప్తంగా వాల్మీకి స్కామ్‌పై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాల్మీకి స్కామ్‌తో తెలంగాణ రాజకీయాలకు ముడిపడి ఉందని, ఈ స్కామ్ ద్వారా భారీగా డబ్బు మళ్ళించబడిందని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. కర్ణాటకలో మొదలైన ఈ స్కామ్ ని సరిగ్గా విచారిస్తే తెలంగాణ ప్రభుత్వం కూలిపోతుందని కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. ఇంతకీ ఈ వాల్మీకి స్కామ్ అంటే ఏమిటి? అని నెటిజన్లు కూడా తెగ సెర్చ్ చేస్తున్నారు.
కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో వెలుగు చూసిన 187 కోట్ల విలువైన కుంభకోణం హైదరాబాద్‌కూ పాకింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అధికార పార్టీపై ప్రతిపక్ష బీఆర్ఎస్ సంచలన ఆరోపణలకు పాల్పడింది. తాజాగా కేటీఆర్ ఈ స్కామ్ పై లేవనెత్తిన ప్రశ్నలు సంచలనంగా మారాయి. వాల్మీకి కుంభకోణంపై ఈడీ మౌనం వహించడంపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన పలు ప్రశ్నలు సంధించారు.
కాంగ్రెస్‌ను ఎవరు కాపాడుతున్నారు అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ స్కామ్ కు సంబందించినా అనేక ఆధారాలు బయటకు వచ్చినప్పటికీ తెలంగాణలో ఈడీ ఎందుకు మౌనంగా ఉంది? ఇక్కడ కాంగ్రెస్‌ను ఎవరు కాపాడుతున్నారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు కేటీఆర్. వాల్మీకి కుంభకోణం కథ ఏంటంటే.. ఎస్టీ కార్పొరేషన్ నుండి సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా నిధులను బదిలీ చేసిందనే ఆరోపణలకు సంబంధించినది.ఎస్టీ కార్పొరేషన్ సొమ్మును ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని నకిలీ ఖాతాలకు మళ్లించినట్లు ఈడీ విచారణలో గతంలోనే తేలిందని కేటీఆర్ ఆరోపించారు. కర్ణాటకలో బయటపడ్డ వాల్మీకి స్కామ్ తో తెలంగాణ రాజకీయ నాయకులు మరియు వ్యాపారవేత్తలకు రహస్య సంబంధాలు కొనసాగాయని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ స్కామ్ లో భాగంగా హైదరాబాద్‌లోని 9 మంది బ్యాంకు ఖాతాదారులకు ఎస్టీ కార్పొరేషన్ డబ్బు రూ. 45 కోట్లు బదిలీ అయ్యాయని కేటీఆర్ ఆరోపణలు చేశారు. అంతేకాదు V6 సంస్థ యజమాని ఎవరని కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నలు సంధించారు. దీనికి సంబంధించి తెలంగాణలో సిట్, సీఐడీ, ఈడీ దాడులు చేసిన తర్వాత కూడా మీడియాలో వార్తలను ఎందుకు అటకెక్కించారని అనుమానాలు వ్యక్తం చేశారు.
లోక్‌సభ ఎన్నికల సమయంలో నగదు విత్‌డ్రా చేసిన బార్‌లు, బంగారం షాపులను ఎవరు నడుపుతున్నారు? కాంగ్రెస్ పార్టీతో వీరికి సంబంధం ఏమిటి?, అలాగే కర్ణాటక అసెంబ్లీలో సీఎం సిద్ధరామయ్య ఈ స్కామ్‌లో 90 కోట్లు అవినీతి చేసినట్లు పేర్కొన్నారు. అక్కడ కర్ణాటకలో సిద్ధరామయ్యను తొలగిస్తే తెలంగాణ ప్రభుత్వం కూడా కూలిపోతుందని కర్ణాటక మంత్రి సతీష్ జారకిహోళి ఎందుకు అన్నారు? దాని అర్థం ఏమిటి? అని కేటీఆర్ సంచలనంగా ప్రశ్నలు సంధించారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో తెలంగాణలోని 9మందికి మద్యం, డబ్బు పంచడం కోసం రూ.44.6 కోట్లు అందాయని ఈడీ, సిట్ విచారణలో ప్రాథమికంగా తేలిందని కేటీఆర్ అన్నారు.
Also Read: Palla Rajeshwar Reddy : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పై కేసు నమోదు