Site icon HashtagU Telugu

Poonam Kaur and Rahul: పూనమ్ కౌర్ చేయి పట్టుకున్న రాహుల్ గాంధీ.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్!

Poonam Kaur

Poonam Kaur

తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. తెలుగు నటి పూనమ్ కౌర్ తన మద్దతును తెలియజేయడానికి రాహుల్ గాంధీని కలిసింది. రాహుల్ గాంధీతో ఆమె చేయి పట్టుకున్న ఫోటో ఒకటి వైరల్ అయింది. ఎప్పటిలాగే బీజేపీ ఐటీ సెల్ సభ్యులు సోషల్ మీడియాలో రాహుల్ గాంధీని కించపరిచే వ్యాఖ్యలతో ట్రోల్ చేయడం ప్రారంభించారు. బీజేపీకి చెందిన ప్రీతి గాంధీ రియాక్ట్ అయ్యారు. ఆ తర్వాత పూనమ్ కౌర్ తన ట్విట్టర్ ద్వారా “ఇది మమ్మల్ని పూర్తిగా కించపరిచేలా ఉంది.

ప్రధాని నారీ శక్తి గురించి మాట్లాడారని గుర్తుంచుకోండి. నేను కింద పడిపోయే సమయంలో రాహుల్ సార్ నా చేయి పట్టుకున్నారు” అని ట్వీట్ చేసింది. తన రియాక్షన్ ద్వారా ట్రోల్స్ నోరు మూయించింది పూనమ్ కౌర్. సినిమాల్లో అంతగా సక్సెస్ కాలేకపోయిన పూనమ్ కౌర్ ఇప్పుడు రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని ప్రయత్నిస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరింది. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ గురించి ఆమె వివాదాస్పద ట్వీట్లు కారణంగా ఆమె అప్పుడప్పుడు హాట్ టాపిక్ గా నిలుస్తుంది.