Site icon HashtagU Telugu

Ktr-Samantha: కేటీఆర్ అందుకే సమంతను బ్రాండ్ అంబాసిడర్ చేసారా?

Raghunandan On Ktr And Samantha

Raghunandan On Ktr And Samantha

 Ktr And Samantha: ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు (Akkineni Nagarjuna) చెందిన ఎన్ కన్వెన్షన్ (N Convention Centre) సెంటర్ కూల్చివేత తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) ప్రకంపనలు సృష్టిస్తోంది. తాను ఎన్ కన్వెన్షన్ హాల్‌ను అన్ని అనుమతులు తీసుకునే నిర్మించామని నాగార్జున చెబుతుండగా, తుమ్మిడికుంట చెరువులో (Thummidikunta Lake) 3 ఎకరాల 30 గుంటలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించారని అధికారులు చెబుతున్నారు.

దీంతో తుమ్మిడి చెరువులో మూడున్నర ఎకరాల భూమిలో ఉన్న ఈ నిర్మాణాన్ని అధికారులు కూల్చేశారు (Demolition). దీనిపై రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. రాష్ట్రంలో అన్ని అక్రమ కట్టడాలను (Illeagal Construction) ఇదే విధంగా కూల్చివేయాలని డిమాండ్ తెర మీదకు వచ్చింది. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి (Cm Revanth Reddy) ఎన్ని ఒత్తిడిలు వచ్చినా ఈ విషయంలో తగ్గేది లేదని తేల్చి చెప్పారు. ఇలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టిన ఎవర్నీ వదిలిపెట్టబోమని ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ వివాదంలోకి అక్కినేని నాగార్జున మాజీ కోడలు, హీరోయిన్ సమంతను (Heroine Samantha) తెరపైకి తీసుకువచ్చింది బీజేపీ. ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు (Mp Raghunandan Rao) సంచలన కామెంట్స్ చేశారు.

పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎన్ కన్వెన్షన్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదని మాజీ మంత్రి కేటీఆర్‌ను (Ex Minister Ktr) ప్రశ్నించారు. ఎన్ కన్వెన్షన్ పై చర్యలు తీసుకుని చెరువు భూమిని గుర్తించాలని 2014లో హై కోర్టు (High Court) ఆదేశించింది. దీనిపై అప్పటి మంత్రి కేటీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. పదేళ్లు మౌనంగా ఉన్నారు. పైగా నాగార్జున మాజీ కోడలు సమంతని (Samantha) తీసుకువచ్చి తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. దాని వెనుక ఆంతర్యం ఏంటి అంటూ రఘునందన్ రావు (Raghunandan Rao) సంచలన వ్యాఖ్యలు (Hot Comments) చేశారు. దీంతో ఆయన ఈ వివాదంలోకి సమంతని కూడా లాగినట్లు అయింది. ఇన్నాళ్లు ఎన్ కన్వెన్షన్‌పై సంపాదించిన డబ్బంతా తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు చేరేలా రేవంత్ రెడ్డి (Revanth Reddy) చర్యలు తీసుకోవాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు.