Site icon HashtagU Telugu

KCR Health Belletin: కేసీఆర్ ఆరోగ్యంపై గోప్యత ఎందుకు? గత ముఖ్యమంత్రుల పరిస్థితేంటి?

Cm Kcr Health Belletin

Cm Kcr Health Belletin

KCR Health Belletin: తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై బీఆర్ఎస్ వర్గాలు ఎందుకు మౌనం వహిస్తున్నాయి. మంత్రి కేటీఆర్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన ఎందుకు చెయ్యట్లేదు. ఇటీవల మోడీ , కేసీఆర్ తనను కలిసి ఎన్డీయేలో కలుపుకోవాలని, కేటీఆర్ ని సీఎం చేయాలనీ తనని సాయం అడిగినట్టు మోడీ వ్యాఖ్యలు రాజకీయంగా అలజడి సృష్టించాయి. పైగా మోడీ వ్యాఖ్యలపై కేసీఆర్ ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ చేయలేదు. తాజా సమాచారం ఏంటంటే తనని ముఖ్యమంత్రిని చేయాలనీ కేటీఆర్ కేసీఆర్ పై ఒత్తిడి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది.

గతంలో ముఖ్యమంత్రుల ఆరోగ్య పరిస్థితులని కూడా గోప్యంగా వచ్చారు. చివరకు వాళ్ళు ఏమయ్యారో తెలియంది కాదు. బిఎస్‌పి వ్యవస్థాపకుడు కాన్షీరామ్ రోజుల తరబడి అనారోగ్యంతో ఉన్నప్పుడు ఏమి జరిగిందో ఎవరికీ చెప్పలేదు. అతని ఆరోగ్య పరిస్థితి ఏమిటో ఎవరికీ తెలియదు.అదంతా ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మనవతి రహస్యంగా ఉంచారు. తాజాగా మాజీ ముఖ్యమంత్రి జయలలిత. ఆమె ఆరోగ్య పరిస్థితిని కూడా పూర్తిగా గోప్యంగా ఉంచారు. దీనికి శశికళ కారణమని భావించారు. ఈ నేపథ్యంలో పతిపక్షాలు కేసీఆర్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై వెంటనే బీఆర్ఎస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి కేటీఆర్ ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారని బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.

కేసీఆర్ ఆరోగ్యంపై పుకార్లు వచ్చాయి. ఆయన తేలికపాటి వైరల్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. రెండు రోజుల క్రితం మంత్రి కేటీఆర్ ఇప్పుడు తనకు సెకండరీ ఇన్ఫెక్షన్ ఉందని, ఇది బ్యాక్టీరియా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అని చెప్పారని శశిధర్ రెడ్డి గుర్తు చేశారు. ఈ క్రమంలోనే కేసీఆర్ ఆరోగ్యంపై మెడికల్ బులెటిన్ విడుదల చేయాలని, లేదంటే ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యులు బయటకు వచ్చి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ప్రజలకు చెప్పాలని ఆయన అన్నారు.ఈ మేరకు ఆయన నిన్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు లేఖ కూడా రాశాను. సిఎం మెడికల్ బులెటిన్లు విడుదల చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించాలని తమిళిసై సౌందరరాజన్‌కు లేఖ రాశారు.

Also Read: TDP : టీడీపీకి నేడు బిగ్‌డే.. చంద్రబాబు కేసుల్లో వెల్ల‌డికానున్న తీర్పులు