Site icon HashtagU Telugu

Exit Polls 2024 : తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో ఎవరు గెలుస్తున్నారు..?

Tsloksabha

Tsloksabha

దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబదించిన ఎగ్జిట్ పోల్స్ వచ్చేస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో బిజెపి గెలువబోతుందని చెపుతుండగా..ఏపీలో కొన్ని సంస్థలు కూటమి గెలువబోతుందంటే..మరికొన్ని సంస్థలు వైసీపీ గెలవబోతుందని అంటున్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే…17 లోక్ సభ స్థానాలకు సంబదించిన పోలింగ్ జరుగుంది.

టీవీ-9 పోల్ స్ట్రాట్ ఎగ్జిట్ పోల్స్‌ : అధికార కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలు దక్కించుకుంటుందని అంచనా వేయగా..బీజేపీ 7 చోట్ల విజయం సాధిస్తుందని పేర్కొంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కేవలం ఒక్క సీటుకే పరిమితం అవుతోందని వెల్లడించింది. ఎంఐఎం తన సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుంటుందని తెలిపింది.

We’re now on WhatsApp. Click to Join.

ఆరా సంస్థ సైతం ఎగ్జిట్ పోల్స్ : బీజేపీ 8-9 సీట్లు, కాంగ్రెస్‌ 7-8, ఎంఐఎం 1 చోట విజయం సాధిస్తుందని, బీఆర్ఎస్‌కు మాత్రం ఒక్క ఎంపీ సీటు కూడా రాదని అంచనా వేసింది. బీఆర్ఎస్‌కు ఒక్క ఎంపీ సీటు కూడా దక్కదనన్న ఆరా సంస్థ తెలిపింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, చేవేళ్ల, మల్కాజగిరి, జహీరాబాద్, సికింద్రాబాద్ స్థానాల్లో బీజేపీ గెలిచే ఛాన్స్ ఉందని ఆరా సంస్థ అధినేత మస్తాన్ వెల్లడించారు. మహబూబ్ నగర్ లో గట్టిపోటీ ఉన్నప్పటికీ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ స్వల్ప ఆధిక్యంతో గెలుస్తారని జోస్యం తెలిపారు. ఇక ఖమ్మంలో కాంగ్రెస్ విజయం సాదించబోతుందని తెలిపారు.

Read Also : Manam : ‘మనం’ మూవీ వెంకటేష్ చేయాల్సింది.. కానీ అక్కినేని ఫ్యామిలీ..

Exit mobile version