Site icon HashtagU Telugu

Vijay Madduri: జ‌న్వాడ రేవ్ పార్టీ కేసు.. విజ‌య్ మ‌ద్దూరి నిజం చెబుతున్నారా?

Vijay Madduri

Vijay Madduri

Vijay Madduri: తెలంగాణ‌లో ఇప్పుడు ఏదైనా హాట్ టాపిక్‌గా చ‌ర్చ న‌డుస్తోంది అంటే అది జ‌న్వాడ ఫామ్ హౌస్ పార్టీ గురించే. బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావ‌మ‌రిది రాజ్ పాకాల ఇంట్లో రేవ్ పార్టీ జ‌రిగింద‌ని, విదేశీ మ‌ద్యం, డ్ర‌గ్స్ వినియోగించార‌ని ఎక్సైజ్ శాఖ అధికారులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ పార్టీ రేవ్ పార్టీ కాద‌ని, త‌న బావ‌మ‌రిది రీసెంట్‌గా గృహ‌ప్ర‌వేశం చేశాడ‌ని.. ఆరోజు పిల‌వ‌లేక‌పోయిన వారందర్నీ దీపావ‌ళి పండ‌గ సంద‌ర్భంగా ఇంటికి పిలిచి పార్టీ ఇచ్చాడ‌నేది కేటీఆర్ వెర్ష‌న్‌. అయితే ఇందులో ప్ర‌ముఖంగా వినిపిస్తున్న పేరు విజ‌య్ మ‌ద్దూరి. రాజ్ పాకాల ఇంట్లో నిర్వ‌హించిన పార్టీలో కొంత‌మందికి డ్ర‌గ్స్ టెస్ట్ చేయ‌గా అందులో విజ‌య్ మ‌ద్దూరి (Vijay Madduri)కి పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు అధికారులు తెలిపారు.

అయితే విజ‌య్ మ‌ద్దూరి ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీకి సీఈవో అని తెలుస్తోంది. అలాగే కేటీఆర్‌కు స‌న్నిహితుడిగా మంచి పేరు ఉంది. ఆయ‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు కొన్ని గంట‌ల‌పాటు ప్ర‌శ్నించిన అత‌డ్ని వ‌దిలేశారు. బ‌య‌టికి వ‌చ్చిన విజ‌య్ ఈ పార్టీకి సంబంధించిన కీల‌క అంశాల‌ను మీడియా ముందు ప్ర‌స్తావించారు.

Also Read: Emerging Asia Cup: చ‌రిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్థాన్‌.. ఎమర్జింగ్ కప్ విజేత‌గా రికార్డు!

బ‌య‌ట రాస్తున్న‌ది ఒక్క‌టి.. లోప‌ల జ‌రుగుతున్నది మ‌రోక్క‌టని ఆయ‌న చెప్పారు. తాను చెప్పని మాటలు కూడా తాను చెప్పినట్లుగా FIR కాపీలో పోలీసులు రాసి తప్పుడు ప్రచారం చేస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. మా కుటుంబ సభ్యులతో కలిసి రాజ్ పాకాల ఇంట్లో ఫంక్షన్ కి వెళ్తే బద్నాం చేయాలని కుట్రపూరితంగా చేస్తున్నారని ఆయ‌న మండిప‌డ్డారు. త్వ‌ర‌లోనే అన్ని విషయాలు కోర్టు సాక్షిగా బ‌య‌టికి వ‌స్తాయ‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు. అయితే విజ‌య్ మ‌ద్దూరి ఇటీవ‌ల కొన్ని దేశాల‌కు వెళ్లి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు చెబుతున్న‌వి, కాంగ్రెస్ అనుకూల మీడియాలో వ‌స్తున్నవి నిజం కాద‌ని, ప్ర‌జ‌లు వాటిని న‌మ్మ‌కూడ‌ద‌ని ఆయ‌న చెప్పారు. అమెరికా, యూర‌ప్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లి వ‌చ్చిన ప్రూప్స్ కూడా పోలీసుల‌కు ఇచ్చిన‌ట్లు ఆయ‌న తెలిపారు.

ఇకపోతే జ‌న్వాడ ఫామ్ హౌస్ పార్టీలో జ‌రిగిన పార్టీ రేవ్ పార్టీ అని అధికార ప‌క్షం ఆరోపిస్తుండ‌గా.. ప్ర‌తిప‌క్షం దీన్ని ఖండిస్తోంది. బీఆర్ఎస్‌ను ఎదుర్కొలేక ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నార‌ని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఏదీ ఏమైనా ఉంటే స‌మాధానాలు చెప్పాల‌ని కానీ ఇలా కుటుంబాల‌ను అడ్డం పెట్టుకోవ‌డం ఎంత‌వ‌ర‌కు క‌రెక్ట్ అని నెటిజ‌న్లు సైతం అభిప్రాయ‌ప‌డుతున్నారు.