Site icon HashtagU Telugu

Farm House Files: ఎవ‌రీ తుషార్‌! ఏమా క‌థ‌! కేసీఆర్, సై!

Thushar

Thushar

తెలంగాణ సీఎం కేసీఆర్ చెబుతోన్న బీజేపీ దొంగ తుషార్‌. గ‌తంలో గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సై వ‌ద్ద ఏడీసీగా ప‌నిచేశార‌ట‌. ఆ విష‌యాన్ని గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సై మీడియాకు వెల్ల‌డించారు. ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేయ‌డానికి ఫామ్ హౌస్ కు వ‌చ్చిన తుషార్ కూడా అత‌డేనంటూ కేసీఆర్ చెప్పే మాట. రాష్ట్రంలో తుషార్ కు ఏం ప‌ని? ఎందుకు ఫామ్ హౌస్ కు వ‌చ్చారు. ఆయ‌న‌కు బీజేపీ నేత బీఎల్ సంతోష్ కు సంబంధం ఉందా? తుషార్ ఇటీవ‌ల గ‌వ‌ర్న‌ర్ ను ఎందుకు క‌లిశారు? ఇవ‌న్నీ ఫామ్ హౌస్ డీల్ కు గ‌వ‌ర్న‌ర్ బంగ‌ళాకు ముడిపెట్టే అంశాలు.

ఇంత‌కూ ఎవ‌రీ తుషార్ అంటూ గుగూల్ లో అన్వేషిస్తే ఆయ‌న చ‌రిత్ర కొంత వ‌ర‌కు బ‌య‌ట‌ప‌డింది. దాని ప్ర‌కారం తుషార్ బిజెపి మనిషి కాదు. అత‌ను రాహుల్ పై పోటీ చేసిన బిజెపి అభ్యర్థి కాదు. లెఫ్ట్ పార్టీల‌కు ఈ తుషార్ సన్నిహితుడు. తుషార్ అలియాస్ తుషార్ వెల్లపల్లి తండ్రి పేరు నటేషన్‌. వీళ్లకు ఒక పార్టీ ఉంది. దాని పేరు భారత ధర్మ జనసేన. కేరళ బిజెపికి వేరే దిక్కు లేక ఈ తుషార్ కు మద్దతు ఇచ్చింది. ఎన్డీఏ అభ్యర్థి అంటూ ప్రకటించింది. ఆ తర్వాత పట్టించుకోలేదని నటేశన్ పలు మార్లు ఆరోపించాడు.

Also Read:  Gnaneswar Swearing: తొలిరోజే `జ్ఞానేశ్వ‌ర్` స్వ‌రాలు తారుమారు

వాస్తవానికి తుషార్ కు కేర‌ళ రాష్ట్రంలో అంత సీన్ లేదు. ముస్లింలకు ప్రాబల్యం ఉన్న ప్రాంతం కాబట్టి రాహుల్ గాంధీకి వచ్చిన ఓట్లల్లో 10 శాతం కూడా తుషార్ కు రాలేదు. ఒక రకంగా చెప్పాలంటే డిపాజిట్ కూడా రాలేదు. ఇక తుషార్ తండ్రి నటేషన్ కు ఒక సంస్థ ఉంది. దాని పేరు శ్రీ నారాయణ ధర్మ పరిపాలనయోగం. కేరళలోని `ఈలవ` అనే ఒక బలమైన బీసీ కమ్యూనిటీని ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఆ సంస్థకు నటేషస్ ప్రధాన కార్యదర్శి. ఆమధ్య కేరళ ముఖ్యమంత్రి, కొందరు మంత్రులు నటేషస్ నివాసానికి స్నేహపూర్వకంగా వెళ్లారు. ఎందుకంటే హిందువుల సమస్యలపై ఈ సంస్థ సిపిఎం కు మ‌ద్ధ‌తు ఇస్తుంది. ఇక ఇదే నటేషస్ ఆ మధ్య శబరిమల కర్మ సమితి మీద విమర్శలకు దిగాడు. శ‌బ‌రిమ‌ల అన్ని హిందూ వర్గాలకు ప్రాతినిధ్యం వహించడం లేదని ఆరోపించాడు. అప్పట్లో సిపిఎం వాల్ ఆఫ్ ఉమెన్ అనే కార్యక్రమానికి నటేశస్ మద్దతు ఇచ్చాడు.

ఆమధ్య ఇదే తుషార్ ను 19 కోట్ల చెక్ బౌన్స్ కేసులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో అరెస్ట్ చేశారు. అయితే దీనిపై కేరళ ప్రభుత్వం రంగంలోకి దిగింది. నా కొడుకును అక్రమంగా అన్యాయంగా ట్రాప్ చేసి అరెస్ట్ చేశారంటూ తుషార్ తండ్రి గగ్గోలు పెట్టాడు. బలమైన `ఈలవ` కమ్యూనిటీ, పైగా హిందూ ఇష్యూస్ లో నటేషన్ సహకరిస్తూ ఉంటాడు. దీంతో కేరళ ముఖ్యమంత్రి రంగంలోకి దిగాడు. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ కు లేఖ రాశారు. జైలులో తుషార్ ఆరోగ్యం బాగాలేదు, వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకోవాలని కోరారు. వాస్తవానికి ఇవన్నీ మలయాళం మీడియాలో పతాక శీర్షికలతో ప్రచురితమైన, ప్రసారమైన వార్తలు. ఇదీ బిజెపి దొంగ అని కేసిఆర్ పదేపదే చెప్పే ఈ తుషార్ అసలు కథ ఇది.

Also Read:  TRS MP: ఈడీ, ఐటీ దాడులను తీవ్రంగా ఖండిస్తున్న: ఎంపీ రవిచంద్ర!

ఇలాంటి వ్యక్తి చెప్తే బిఎల్ సంతోష్ వింటాడా? ఈ తుషార్ డబ్బు మూటలు తీసుకురాగానే ఎమ్మెల్యేలు అమ్ముడుపోతారా? 19 కోట్ల బౌన్స్ కేసులో అరెస్ట్ అయిన తుషార్‌ వందల కోట్లు పెట్టి ఎమ్మెల్యేలను ఎలా కొంటాడు? ఏమో కేసీఆర్ చెబుతున్నారు కాబ‌ట్టి వినాల్సిందే. ఏదో బాంబ్ పేల్చ‌బోతున్నాం అంటూ కేసీఆర్ చెప్ప‌డంతో అంద‌రూ ఆస‌క్తిగా చూశారు. తీరా ఫామ్ హౌస్ ఫైల్స్ వ్య‌వ‌హారం ఆయ‌న అనుకున్న విధంగా పేల‌లేదు. దీంతో ఇప్పుడు గ‌వ‌ర్న‌ర్ బంగ‌ళా వైపు ఫామ్ హౌస్ ఫైల్స్ తిరిగింది. ఇటీవ‌ల తుషార్ గ‌వ‌ర్న‌ర్ బంగ‌ళాకు వ‌చ్చిన విష‌యాన్ని త‌మిళ సై అంగీక‌రించారు. మాజీ ఏడీసీగా తుషార్ ప‌నిచేశార‌ని, ఆ ప‌రిచ‌యాల‌తో రాజ్ భ‌వ‌న్ కు వ‌చ్చార‌ని చెప్పారు. దీంతో తుషార్ మీద కేసీఆర్ చెప్పిన మాట‌ల‌కు బ‌లం చేకూరింది. అంతేకాదు, తుషార్ అంశం బ‌య‌ట‌కురాగానే  ఫోన్ ట్యాపింగ్ జ‌రుగుతుంద‌ని త‌మిళ సై అనుమానం వ్య‌క్తప‌రిచారు. మొత్తం మీద రాజ్ భ‌వ‌న్ కేంద్రంగా ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టే ప్ర‌య‌త్నం జ‌రిగింద‌ని ఎస్టాబ్లిష్ చేసే ప్ర‌య‌త్నం కేసీఆర్ స‌ర్కార్ చేస్తోంది.

సుప్రీం కోర్టు కూడా ఎమ్మెల్యే కొనుగోలు విష‌యాన్ని ప‌రోక్షంగా ప్ర‌స్తావించింది. క‌మిష‌న్ సీవీ ఆనంద్ హెడ్ గా ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై కేసీఆర్ స‌ర్కార్ సిట్ ను ఏర్పాటు చేసింది. దీంతో గ‌వ‌ర్న‌ర్ బంగళా కేంద్రంగా ఏమి జ‌రిగింద‌నే అంశాన్ని ఢిల్లీ కేంద్రంగా బ్లో ఔట్ చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నార‌ని తెలుస్తోంది. ఇదంతా గుజరాత్ పోలింగ్ కు ముందు బ‌య‌ట పెట్టాల‌ని కేసీఆర్ ముహూర్తం పెట్టార‌ని స‌మాచారం. మొత్తం మీద కేసీఆర్ ల‌కు మోడీ, షా ద్వ‌యం దొరికిందా? లేక కేసీఆర్ పై బీజేపీ పైచేయిగా నిలుస్తుందా? అనేది తుషార్ వ్య‌వ‌హారంపై క్లారిటీ వ‌స్తే అర్థం కానుంది.

Also Read:  Modi tour:మోడీ ప‌ర్య‌ట‌న‌కు నిర‌స‌న‌ల సెగ‌, బంద్ షురూ!