Site icon HashtagU Telugu

TTDP: టీటీడీపీ అధ్యక్ష పదవీ కోసం తెలుగు తమ్ముళ్ల లాబీయింగ్

Tdp Political Action Committee Announced by Atchennaidu

Tdp Political Action Committee Announced by Atchennaidu

TTDP: తెలంగాణలో స్తబ్దుగా ఉన్న టీడీపీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు కాసాని జ్ఞానేశ్వర్‌ చేపట్టాక ఎంతో కొంత మైలేజీ పార్టీకి వచ్చింది. సైలంట్ గా  తెలుగు తమ్ముళ్లు యాక్టివ్ మోడ్ లోకి వచ్చారు. అయితే కాసాని రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఇప్పుడు తెలంగాణ టీడీపీకి అధ్యక్షుడు లేరు. ఇక ఎవరికి అవకాశం దక్కుతుందనే దానిపై టీడీపీలో చర్చలు సాగుతున్నాయి. అయితే ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నందున కొత్త అధ్యక్షుడి నియామకంపై చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదని అంటున్నారు. తెలంగాణ ఎన్నికలు పూర్తయిన తర్వాత రాజకీయాలను బట్టి తదుపరి కార్యాచరణ ఖరారు అయ్యే అవకాశం ఉంది.

తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. అయితే అన్ని పార్టీలు టీడీపీకి మద్దతివ్వడానికి ప్రయత్నిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ క్యాడర్..టీడీపీ సానుభూతిపరుల ఓట్లను దండుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు చాలా చోట్ల టీడీపీ జెండాలతో ఆ పార్టీ జెండాలు పట్టుకుని ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే పలు చోట్లా కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు తెలిపారు. ఖమ్మం మదిరలో భట్టి విక్రమార్క, ఖైరతాబాద్ అభ్యర్తికి విజయారెడ్డికి తెలుగు తమ్ముళ్లు మద్దతు తెలిపారు.

అయితే తెలంగాణ టీడీపీని చాలా మంది నేతలు వీడారు. సీనియర్లంతా తమ దారి తాము చూసుకున్నారు. అయితే ఇప్పటికీ చాలా మంది నాయకులు పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. అందులో అరవింద్ కుమార్ గౌడ్ కీలకం. ఈసారి తనకు పార్టీ అధ్యక్ష పదవి ఇస్తారని ఆశిస్తున్నారు. గతంలో అరవింద్ కుమార్ గౌడ్ కు రకరకాల సమీకరణాల కారణంగా అవకాశాలు రాలేదు. టీడీపీ మాజీ నేత దేవేందర్ గౌడ్ కు సమీప బంధువు అయిన అరవింద్ కుమార్ గౌడ్ పార్టీలో అవకాశాలు వచ్చినా రాకపోయినా పార్టీ కోసం కష్టపడుతున్నారు. తాజాగా కాట్రగడ్డ ప్రసూన కూడా యాక్టివ్‌గా మారింది. వీటన్నింటితో పాటు మరికొందరు నేతల పేర్లను చంద్రబాబు పరిశీలించే అవకాశం ఉంది.