Assembly War: బీజేపీ ఫ్లోర్ లీడర్ గా ఈటెలనా.. రఘునందనా..?

తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి.

  • Written By:
  • Publish Date - September 6, 2022 / 10:00 AM IST

తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు వస్తేనే…సభలో అసలు జోష్ కనపడుతుంది. లేదంటే అధికారపార్టీ ఏకపక్షంగా బీజేపీని టార్గెట్ చేసి విమర్శించే ఛాన్స్ ఉంది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ పర్యటనకు వచ్చి రేషన్ బియ్యం పంపిణీ విషయం గురించి తెలంగాణ సర్కార్ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

రేషన్ బియ్యంలో కేంద్రం వాటా ఎంతో చెప్పాలంటూ కామారెడ్డి జిల్లా కలెక్టర్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. రేషన్ షాపుల వద్ద మోదీ ఫొటోలేదని..తానే ఫ్లెక్సీ కడతానని హెచ్చరించారు. దీనిపై అధికార టీఆర్ఎస్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. కానీ ఇప్పటివరకు సీఎం కేసీఆర్ ఈ అంశంపై స్పందించలేదు.

కాగా అసెంబ్లీ వేదికగా ఇవాళ కేసీఆర్…మళ్లీ బీజేపీని టార్గెట్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంది. కానీ ఈ అసెంబ్లీ సమావేశాలకు బీజేపీ ఎమ్మెల్యేలు వస్తారో లేదో అనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు. ఎందుకంటే గత సెషన్స్ లో బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సెషన్స్ ముగిసే వరకు సస్పెండ్ చేశారు. ఆ సెషన్ కు కొనసాగింపుగానే ఈ సమావేశాలు జరుగనున్నాయి. అయితే బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశాలు హాజరుకావడం…కాకపోవడంపై స్పీకర్ నిర్ణయంపై ఆధారపడి ఉంది.

అటు బీజేపీ ఫ్లోర్ లీడర్ రాజాసింగ్ ప్రస్తుతం పీడియాక్ట్ కింద అరెస్టు అయ్యి జైలులో ఉన్నాడు. రాజాసింగ్ కు బదులుగా ఈటెల కానీ…రఘునందన్ కానీ బీజేపీ ప్లోర్ లీడర్ గా ఎంపిక చేస్తారో లేదో చూడాల్సిందే. ఇక కాంగ్రెస్ కు ఎమ్మెల్యేలు పలు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నారు.