Telangana Next IT Minister : కాంగ్రెస్ లో ఐటీ మినిస్టర్ అర్హత ఎవరికీ ఉంది..?

కేటీఆర్ కు దీటుగా ఐటీ ను డెవలప్ చేసే సత్తా కాంగ్రెస్ నేతల్లో ఎవరికీ ఉందనే చ‌ర్చ ఐటీ వ‌ర్గాల్లో జోరుగా సాగుతోంది

  • Written By:
  • Publish Date - December 5, 2023 / 05:31 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్ (Congress) విజయం ఒకెత్తయితే..సీఎం అభ్యర్థి (Telangana CM) ఎవరు..? ఐటీ మినిస్టర్ ( IT Minister) గా ఎవర్ని నియమిస్తారనే చర్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా కూడా చర్చ నడుస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ (KCR) సీఎం గా రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసారు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఐటీ సంస్థలను తీసుకరావడం లో విజయం సాధించారు. ఈ విజయం లో కీలక పాత్ర కేటీఆర్ (KTR) దే అని చెప్పాలి.

హైదరాబాద్ లో ఐటీ ని మొదటగా పరిచయం చేసింది చంద్రబాబు (Chandrababu) అయితే..పూర్తిస్థాయిలో హైదరాబాద్ లో విస్తృతం చేసింది మాత్రం కేటీఆర్ అనే చెప్పాలి. ఒక్క హైదరాబాద్ లోనే కాదు రాష్ట్రంలోని అనేక జిల్లాలో ఐటీ హబ్ (IT Hub) లను తీసుకొచ్చి ఎంతగానో డెవలప్ చేసారు. ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రిగా ఆయనకంటూ ఓ ముద్ర వేసుకున్నారు. నిరంత‌రం ఐటీ ఉద్యోగుల‌తో సోష‌ల్ మీడియా వేదిక‌గా ట‌చ్‌లో ఉంటూ.. ‘ఫ్రెండ్లీ మినిస్ట‌ర్‌’ అనే పేరు తెచ్చుకున్నారు.

అయితే.. ఇప్పుడు స‌ర్కారు మారిన నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌నుంది. దీంతో ఎవ‌రు ఐటీ శాఖ‌ను చేప‌ట్ట‌నున్నారు? ఎవరు నాటి మంత్రి కేటీఆర్ స్థాయిలో ఐటీ ని మరింత డెవలప్ చేయనున్నారు..? కేటీఆర్ కు దీటుగా ఐటీ ను డెవలప్ చేసే సత్తా కాంగ్రెస్ నేతల్లో ఎవరికీ ఉందనే చ‌ర్చ ఐటీ వ‌ర్గాల్లో జోరుగా సాగుతోంది. అంతేకాదు, గత పదేళ్లుగా ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ అద్భుత సేవలు అందించారని.. ఇప్పుడు ఆయన స్థానాన్ని భర్తీ చేసే నాయకుడు ఎవరంటూ సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్‌ను మిస్ అవుతామని పలువురు కామెంట్స్ సైతం చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రస్తుతం కాంగ్రెస్ వర్గాల్లో దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (Duddilla Sridhar Babu) తో పాటు మదన్ మోహన్ రావు (Madan Mohan Rao) పేరు వినిపిస్తుంది. కానీ మదన్ మోహన్ రావు అయితే ఐటీ ని మరింత డెవలప్ చేస్తారని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఎల్లారెడ్డి నుండి విజయ డంఖా మోగించిన మదన్ మోహన్ రావు..ఎన్నో ఇంటర్ నేషనల్ సంస్థల సీఈఓ లతో పరిచయాలు ఉన్నాయి. అంతే కాదు 20 దేశాల్లో ఐటీ సంస్థలు ఉన్నాయి. అలాగే రాజకీయ పార్టీలకు కావలసిన సమాచారం అందించే ఎన్నో యాప్ లను ఈయన ఐడియా లతో రూపొందించి సక్సెస్ అయ్యారు.

Madanmohanrao

మదన్ మోహన్ రావు స్టడీ చూసుకుంటే.. హైదరాబాద్ లోని NG Ranga Agriculture University Campus లో, M.Sc , B.Sc. (Agri) పూర్తి చేసాడు. IT Cell చైర్మన్ గా బాధ్యతలు వహించారు. ఇక 2010 , 2020 పలు అమెరికా ఐటీ సంస్థలకు డైరెక్టర్ గా , మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. ఆస్ట్రేలియా , సింగపూర్ , న్యూజ్లాండ్ తదితర దేశాల్లో బిజినెస్ చేసి… అనేక దేశాల్లో తిరిగి..అక్కడి బిజినెస్ నేతలతో మాట్లాడుతూ…బిజినెస్ ను డెవలప్ చేసాడు. ఇలా ఐటీ లో తనకంటూ ఓ గుర్తింపు మదన్ మోహన్ రావు కు ఉంది. అంతే కాదు ఈయన రాహుల్ గాంధీ కి చాల దగ్గరి సన్నిహితుడు కూడా. ఇలా అన్ని కూడా మదన్ మోహన్ రావు కు అనుకూలంగా ఉండడం తో ఐటీ మినిస్టర్ పదవికి చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్ అధిష్టానం కూడా మదన్ మోహన్ వైపే మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తుంది.

Read Also : CM Revanth Reddy: 48 గంటలుగా ఎల్లా హోటల్ లోనే రేవంత్ .. భారీ భద్రత పెంపు