Site icon HashtagU Telugu

TS : అమ్మవారి హుండీలో 100కోట్ల రూపాయల చెక్కు…కానుక ఇచ్చింది ఎవరో తెలుసా..?

Jogulamba Temple Priest

Jogulamba

జోగులాంబ దేవాలయం…తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతోంది. ఇప్పుడు ఈ అమ్మవారి దేవాలయంలో వార్తల్లో నిలిచింది. ఓ అజ్నాత భక్తుడు హుండీలో 100కోట్లరూపాయల చెక్కు కానుకగా వేయడం చర్చనీయాంశంగా మారింది. వందకోట్లు రూపాయల చెక్కును హుండీలో గుర్తించిన ఆలయ అధికారులు…భక్తుడు ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా పోలీసులను ఆశ్రయించారు. దీనిపై ఆరా తీసిన పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ వందకోట్ల చెక్కును కానుకగా వేసింది భక్తుడు కాదని తేలింది. ఈ చెక్కు హుండీలో వేసిన బ్యాంక్ అకౌట్ ఏపీలోని గ్రామీణ వికాస్ బ్యాంక్ వరంగల్ బ్రాంచీకి చెందినదని గుర్తించారు పోలీసులు.

హుండీలో వేసింది ఆలంపూర్ మండలానికి చెందిన భక్తుడిగా గుర్తించారు. అతని బ్యాంకులో కేవలం 23రూపాయలు ఉంటే…వంద కోట్ల చెక్కు వేయడంపై పోలీసులు ఆరా తీశారు. అతనికి మతిస్తిమితం లేదని తెలియడంతో…చికిత్స కోసం ఎర్రగడ్డ ఆసుపత్రికి తరలించారు. అతనికి మతిస్థితిమితం లేకపోయినప్పటికీ…చెక్కు ఆర్మీ జవాన్ల కోసమని రాసి ఉన్నట్లు అధికారులు తెలిపారు. మతిస్తిమితం లేకున్నా..వందకోట్ల చెక్కు హుండీలో వేశాడంటే..అతనికి మంచి చేయాలన్న ఆలోచన వచ్చిందని పోలీసులు భావిస్తున్నారు. అతనిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు.