Telangana Ministers : తెలంగాణ లో మిగతా మంత్రులు ఎవరు..?

ఇక ఖాళీగా ఉన్న 06 స్థానాల కోసం 15 మందికి పైగా సీనియర్లు పోటీ పడుతున్నట్లు సమాచారం

Published By: HashtagU Telugu Desk
Congress Rajya Sabha Candidates

Congress Emls

తెలంగాణ (Telangana ) లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ (Congress) తన మార్క్ పాలనను కనపరుస్తుంది. ఎన్నికల మేనిఫెస్టో లో ప్రకటించిన ఆరు హామీల్లో రెండు హామీలను..కేవలం అధికారం చేపట్టిన రెండు రోజుల్లో అమలు చేసి ప్రజల్లో నమ్మకం ఏర్పర్చుకుంది. అలాగే పార్టీ లోని ముఖ్య నేతలకు మంత్రి పదవులు ఇవ్వడం..వారికీ కీలక శాఖలను అప్పగించింది. ఇంకా మిగిలిన శాఖలకు సంబంధించి ఎవర్ని ఎంపిక చేస్తారనేది ఆసక్తిగా మారింది.

ఇక ఖాళీగా ఉన్న 06 స్థానాల కోసం 15 మందికి పైగా సీనియర్లు పోటీ పడుతున్నట్లు సమాచారం. వారిలో షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్, వివేక్, వినోద్, మల్రెడ్డి రంగారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మైనంపల్లి హన్మంతరావు, సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ రావు, మధుయాష్కీ గౌడ్, అద్దంకి దయాకర్, బాలు నాయక్ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. సీనియారిటీ, కుల సమీకరణాల ప్రకారం పదవులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతుంది. మరి వీరిలో ఎవరికీ పదవులు దక్కుతాయో చూడాలి.

We’re now on WhatsApp. Click to Join.

ప్రస్తుతం మంత్రిపదవులు దక్కించుకున్న నేతలు మరియు వారి శాఖలు ఈ విధంగా ఉన్నాయి.

కోమటి రెడ్డి వెంకటరెడ్డి – ఆర్అండ్‌బీ

భట్టి విక్రమార్క – ఆర్థిక శాఖ

దామోదర రాజనర్సింహ – ఆరోగ్య శాఖ

శ్రీధర్ బాబు – ఐటి, శాసనసభ వ్యవహారాలు

సీతక్క – పంచాయితీ రాజ్

తుమ్మల – వ్యవసాయ

జూపల్లి – ఎక్సైజ్

పొన్నం ప్రభాకర్ – రవాణా శాఖ

పొంగులేటి శ్రీనివాసరెడ్డి – సమాచార శాఖ

కొండా సురేఖ – అటవీ శాఖ

ఉత్తమ్ కుమార్ రెడ్డి – సివిల్ సప్లయ్, భారీ నీటి పారుదల

Read Also : Free Bus : మహిళలతో కిక్కిరిసిపోతున్న ఆర్టీసీ బస్సులు

  Last Updated: 10 Dec 2023, 01:35 PM IST