Site icon HashtagU Telugu

Telangana BJP: కార్యకర్తల్ని నిండా ముంచిన బీజేపీ

Telangana BJP

Telangana BJP

Telangana BJP: ఎదుగుదల దశలో ఉన్న కీలక నేత బండి సంజయ్ కు బీజేపీ అధిష్టానం చెక్ పెట్టిందని పరిశీలకులు అంటున్నారు. గతంలో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితి దారుణంగా ఉండేది. ఇలాంటి సమయంలో బండి వంటి ఫైర్ బ్రాండ్ పార్టీ అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారనే టాక్ వచ్చింది. కానీ ఆయన్ను తప్పించి బీజేపీ తన గొయ్యి తానే తవ్వుకున్నట్లు ఇప్పుడు ఫలితం తేటతెల్లం చేస్తుండటం గమనార్హం.

తెలంగాణలో 2018లో బీజేపీ పార్టీ జీరో.. ఒకే ఒక్క సీటు ఉండేది. ఘోషామహల్ నుంచి రాజాసింగ్ గెలుపొందడం తప్ప.. మరొక్క ఎమ్మెల్యే కనిపించేవారు కాదు. అలాంటి కమలం పార్టీని ఎదగడానికి బండి సంజయ్ చాలానే కృషి చేశాడు. మూడు ప్రధాన ఉపఎన్నికలు, కీలకమైన హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ పార్టీ గట్టెక్కించాడు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీగా.. బీజేపీని నిలబెట్టడంలో బండి సంజయ్ సఫలమయ్యారు. ఒకానొక దశలో బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం అనే టాక్ తెచ్చుకున్న ఫైర్ బ్రాండ్. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రజాసంగ్రామ యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అనేక కేసులు కూడా నమోదయ్యాయి. అయితే.. తీరా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయనను పార్టీ అధిష్టానం పక్కన పెట్టింది.

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కుప్పకూలింది. దుబ్బాక వంటి ప్రతిష్టాత్మక నియోజకవర్గంలో కూడా బీజేపీ సత్తా చాటలేకపోయింది. అలాగే హుజూరాబాద్ లోనూ ఓడింది. 119 స్థానాలకు గానూ 118 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టిన బీజేపీ కేవలం 8 స్థానాల్లోనే విజయం సాధించింది. బీజేపీ అధిష్టానం తీసుకున్న తప్పుడు నిర్ణయం కారణంగా తెలంగాణలో కమలం ప్రస్థావన ముగిసినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు పార్టీని, బండిని నమ్ముకున్న కారకర్తలు కూడా మోసపోయారు. ఏదేమైనా తెరవెనుక వ్యూహం ఏంటనేది పక్కనపెట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకుంది. బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్రకు సిద్ధమౌతోంది.

Also Read: KTR: ప్రతిపక్ష పార్టీ బాధ్యతలను విజయవంతంగా నిర్వహిద్దాం: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేటీఆర్

Exit mobile version