Where is Santosh? ఎంపీ సంతోష్ ఎక్కడ? టీఆర్ఎస్ నేతల అయోమయం!

రాజ్యసభ ఎంపీ, టీఆర్‌ఎస్‌ పార్టీ అగ్రనేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కు సన్నిహితుడు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌.

  • Written By:
  • Updated On - September 28, 2022 / 12:59 PM IST

రాజ్యసభ ఎంపీ, టీఆర్‌ఎస్‌ పార్టీ అగ్రనేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కు సన్నిహితుడు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌. ప్రస్తుతం సంతోష్ కుమార్ కు  సంబంధించిన ఓ వార్త ఆసక్తి రేపుతోంది. కొన్ని రోజుల క్రితం అతని ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో ఆయనపై రూమర్స్ వస్తున్నాయి. అటు ముఖ్యమంత్రి, ఇటు పార్టీలోని ముఖ్య నేతలతో పాటు దేశవ్యాప్తంగా ఇతర నాయకులకు మధ్య వారధిగా వ్యవహరించే సంతోష్ గత కొద్దిరోజులుగా సైలంట్ గా ఉంటుండంతో హాట్ టాపిక్ గా మారింది.

ఢిల్లీ మద్యం కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడుల రూపంలో టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కె. కవిత పేరు వినిపించింది. ఆ తర్వాత సంతోష్‌తో సంబంధం ఉన్న వెన్నమనేని శ్రీనివాసరావుతో పాటు పలు వ్యాపారాలు చేస్తున్నవారిని ఈడీ విచారించింది. శ్రీనివాసరావుపై ఈడీ విచారణ కొనసాగుతుండగా, పలు అనుహ్యమైన విషయాలు వెలుగులోకి వచ్చాయట. అయితే ఈడీ దాడుల నేపథ్యంలో ఎంపీ సంతోష్ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు వెళ్లి చర్చించినట్లు సమాచారం. ఈడీ ఏయే విషయాలను చర్చించిందో, దానికి సంబంధించిన పూర్తి విషయాలను కేసీఆర్ కు సమగ్రంగా చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఆ తర్వాత ఏమైందే ఏమోకానీ సంతోష్ ఫోన్ ను స్విచ్చాఫ్ చేశాడు.

ఈడీ వైఖరి కారణంగానే సంతోష్ మనస్తాపం చెంది ఉండవచ్చునని, లేదంటే కేసీఆర్ ఆదేశానుసారం స్విచ్ఛాప్ చేశారేమోనని? టీఆర్ఎస్ నాయకులతో పాటు సంతోష్ సన్నిహితులు భావిస్తున్నారు. అయితే పార్టీ, ప్రభుత్వ కీలకమైన కార్యకలాపాలలో ముఖ్యమైన పాత్ర వహించే  వ్యక్తి అదృశ్యం కావడంపై స్పష్టమైన సమాచారం లేకపోవడంతో టీఆర్ఎస్ నాయకులు ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “సంతోష్ గారు హైదరాబాద్‌లో చాలా ఉన్నారు. బహుశా అతను కొంచెం అసంతృప్తిగా ఉండవచ్చు. అతను త్వరలో యాక్టివ్ అవుతారు” అని సన్నిహితులు మాత్రం స్పష్టంగా చెబుతుండటం గమనార్హం.