Site icon HashtagU Telugu

Kodandaram: 2.25 లక్షల జాబ్స్ ఎక్కడ? మంత్రి కేటీఆర్ కు కోదండరామ్‌ ఛాలెంజ్

Telangana Jana Samithi Kodandaram Sensational Comments

Telangana Jana Samithi Kodandaram Sensational Comments

Kodandaram: గ్రూప్-2 అభ్యర్థి ప్రవళికది ఆత్మహత్య కాదు అని, ప్రభుత్వ హత్య అని తెలంగాణ జనసమితి అధినేత ఎం. కోదండరామ్ అన్నారు. బీఆర్‌ఎస్ మేనిఫెస్టో యువతకు, ఉద్యోగాలకు దూరంగా ఉందని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన నిరుద్యోగ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ సమావేశంలో కోదండామ్ మాట్లాడారు. 2.25 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్న మంత్రి కె.టి.రామారావుకు కోదండరామ్‌ సవాల్‌ విసిరారు. ఎంతమందికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించిందో వెంటనే డేటాను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఉద్యోగాలు కల్పించినట్టు ఆధారలు ఉంటే ప్రెస్ క్లబ్ వేదికగా అక్టోబర్ 21న డేటాను బయటపెట్టాలని ఛాలెంజ్ విసిరారు. అనంతరం ఏఐసీసీ సభ్యుడు డాలీ శర్మ మాట్లాడుతూ.. మంత్రుల వ్యాఖ్యలు అర్ధరహితంగా ఉన్నాయని, పాలనలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైనట్టు అంగీకరించాలని మండిపడ్డారు.

ప్రవళికను పార్టీ అధినేత రాహుల్‌ గాంధీ కలవకుండా చూసేందుకు ప్రభుత్వం ఆమెను హైదరాబాద్‌కు తరలిస్తోందని టీపీసీసీ అధికార ప్రతినిధి ఎండీ రియాజ్‌ తెలిపారు. ప్రొ.వినాయక్ రెడ్డి మాట్లాడుతూ.. మనం ముందుగానే మేల్కొంటే ఆత్మహత్యను నివారించవచ్చని అన్నారు. సామాజిక కార్యకర్త సజయ కాకర్ల మాట్లాడుతూ.. మీడియాతో మాట్లాడి పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించారని, తమ వద్ద ఉన్న ఆధారాలను కోర్టుకు సమర్పించాలని కోరారు.

Also Read: PM Modi: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్, దీపావళి బోనస్