DK Aruna : ఆదివారం (మార్చి 16న) తెల్లవారుజామున 3.50 గంటలకు బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి చొరబడిన దొంగ దొరికాడు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్–56లో ఉన్న అరుణ ఇంట్లోకి ప్రవేశించిన ఆ దొంగతో ముడిపడిన కీలక వివరాలు బయటికి వచ్చాయి. అవేంటో చూద్దాం..
Also Read :BRS To TRS : బీఆర్ఎస్ పేరును టీఆర్ఎస్‌గా మార్చబోతున్నారా ? ముహూర్తం ఫిక్సయ్యిందా ?
దొంగ ఎక్కడి వాడు ? ఎలా వచ్చాడు ?
- డీకే అరుణ(DK Aruna) ఇంట్లోకి చొరబడిన దొంగ పేరు అక్రమ్.
- అతడు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందినవాడు.
- ధనవంతుల ఇళ్లలో మాత్రమే అక్రమ్ దొంగతనాలు చేస్తాడు. నగదును మాత్రమే దొంగిలిస్తాడు. విలువైన వస్తువులు, నగలను చోరీ చేయడు. వాటిని అమ్మి సొమ్ము చేసుకోవడం కష్టమని భావిస్తాడు.
- కొంతకాలం పాటు దేశ రాజధాని ఢిల్లీలో దొంగతనాలు చేశాడు. అయితేే అక్కడ చాలాసార్లు పోలీసులకు దొరికిపోయాడు.
- 2004 నుంచి ఇప్పటి వరకు అక్రమ్‌పై 17 చోరీ కేసులు ఉన్నాయి.
- ఢిల్లీలో పదే పదే పోలీసులకు దొరుకుతుండడంతో.. అక్రమ్ తన ఠికాణాను హైదరాబాద్‌కు మార్చాడు.
- తొలుత నగరంలోని గుడిమల్కాపూర్ ఏరియాలో రెండు రోజుల పాటు అక్రమ్ రెక్కీ చేశాడు. చివరకు ఎంపీ డీకే అరుణ ఇంట్లో చోరీ చేయాలని డిసైడ్ అయ్యాడు.
- డీకే అరుణ ఇంట్లోకి దూరి ఈజీగా చోరీ చేయొచ్చని అక్రమ్ నిర్ణయించుకున్నాడు. ఒకవేళ తేడాలొచ్చి దొరికినా, వెనకాల ఉన్న రోడ్డు నుంచి పారిపోవచ్చని ప్లాన్ వేసుకున్నాడు.
- ఆదివారం తెల్లవారుజామున 3.50 గంటలకు డీకే అరుణ ఇంట్లోని కిచెన్ వైపున ఉన్న కిటికీ గ్రిల్స్ తొలగించి.. దొంగ లోపలికి ప్రవేశించాడు.
- అక్రమ్ మాస్క్ వేసుకుని డీకే అరుణ ఇంటి లోపలే గంటన్నరపాటు ఉన్నాడు.
- చేతులకు గ్లౌజ్‌లు, ముఖానికి మాస్క్ వేసుకుని.. హాల్‌లో ఉన్న సీసీ కెమెరాల వైర్‌ను కట్ చేశాడు.
- అరుణ బెడ్‌రూమ్ వరకు వెళ్లి అక్కడ కూడా సీసీ కెమెరా వైర్‌ను కట్ చేశాడు.
- ఇంట్లో దొంగపడిన సమయంలో డీకే అరుణ మహబూబ్‌నగర్‌లో ఉన్నారు. ఆ సమయంలో ఇంట్లో డీకే అరుణ కూతురితో పాటు పని మనుషులు ఉన్నారు.